Begin typing your search above and press return to search.

బ్రేకింగ్.. జగన్ వ్యక్తిగత హాజరుపై కోర్టు ఏమని చెప్పింది?

By:  Tupaki Desk   |   1 Nov 2019 6:18 AM GMT
బ్రేకింగ్.. జగన్ వ్యక్తిగత హాజరుపై కోర్టు ఏమని చెప్పింది?
X
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసుల విచారణకు హాజరు కాకుండా ఉండేందుకు వీలుగా వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ ప్రత్యేక కోర్టు డిస్మిస్ చేసింది. ప్రతి శుక్రవారం కోర్టు విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో.. ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న తాను విచారణకు వ్యక్తిగతంగా రాలేనని.. తనకు బదులుగా తన న్యాయవాదిని అనుమతించాల్సిందిగా పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై ఇరు వర్గాల మధ్య సుదీర్ఘ వాదనలు జరిగాయి.

తాజాగా ఈ పిటిషన్ పై సీబీఐ ప్రత్యేక కోర్టు తన తీర్పును వెల్లడించింది. పరిస్థితులు మారాయి తప్పించి నేరంలో ఎలాంటి మార్పు లేదని.. వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది. దీంతో.. ప్రతివారం జరిగే విచారణకు జగన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది.

నిజానికి జగన్ మీద వేసిన అక్రమాస్తుల కేసుల ఉద్దేశం బహిరంగ రహస్యం. రాజకీయంగా ఉన్న విరోధంతో నాడు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఈ కేసుల చిక్కుముడిని వేశారన్న విషయాన్ని చాలామంది ఓపెన్ గానే ఒప్పుకుంటారు. కేవలం తన మాట వినని జగన్ ను రాజకీయంగా చికాకకు పెట్టేలా చేయటం కోసమే ఈ కేసులన్ని అన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అయితే.. కోర్టు ఇలాంటి అంశాల్ని పరిగణలోకి తీసుకోకపోవటమే ఇబ్బందికర పరిస్థితి కారణంగా చెప్పాలి. ఏమైనా.. ఒక ముఖ్యమంత్రి ప్రతి వారం తన మీద ఉన్న కేసు విచారణకు కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.