Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : మాజీ ఎంపీ హర్ష కుమార్ అరెస్ట్

By:  Tupaki Desk   |   14 Dec 2019 11:09 AM IST
బ్రేకింగ్ : మాజీ ఎంపీ హర్ష కుమార్ అరెస్ట్
X
నోరు బాగుంటే ఊరు బాగుంటుందంటారు.. నోటి దురుసే ఇప్పుడు మాజీ ఎంపీ హర్షకుమార్ కు కష్టాలు తెచ్చిపెట్టిందనే ఆరోపణలున్నాయి. వైఎస్ హయాంలో కాంగ్రెస్ ఎంపీగా వెలుగు వెలిగిన ఈనేత దూకుడుకు పర్యాయ పదంగా ఉంటారు. అయితే అన్ని చోట్ల ఈ దూకుడు పని చేయదని తాజాగా మాజీ ఎంపీ హర్షకుమార్ కు అర్థమైంది..

జ్యూడిషియల్ సిబ్బంది పై దూషణ, విధులకు ఆటంకం కలిగించిన కేసులో తాజాగా పోలీసులు మాజీ ఎంపీ హర్షకుమార్ ను అరెస్ట్ చేశారు. రాజమండ్రి త్రీటౌన్ పోలీసులు తాజాగా హర్షకుమార్ పై పలు కేసులు నమోదు చేశారు. కోర్టులో ఆయనను హాజరుపరిచారు. కోర్టు తీర్పు తర్వాత ఆయనకు రిమాండ్ విధించే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 28న రాజమండ్రి కోర్టుకు చెందిన స్థలంలో ఆక్రమణలు తొలగిస్తుండగా మాజీ ఎంపీ హర్షకుమార్ హల్ చల్ చేశారు. పోలీసులు, విధి నిర్వహణలో ఉన్న కోర్టు ఉద్యోగులను బెదిరించారు. మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. న్యాయమూర్తులను పరుష పదజాలంతో దూషించాడు. ఈ మేరకు కోర్టు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు.

కేసు నమోదుకావడంతో హర్షకుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాదాపు 76 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయనను పోలీసులు గుర్తించి ఈరోజు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచారు.