Begin typing your search above and press return to search.

షర్మిల‌ది బ్రేకింగ్ న్యూస్ వాడ‌నా?

By:  Tupaki Desk   |   29 May 2022 3:30 PM GMT
షర్మిల‌ది బ్రేకింగ్ న్యూస్ వాడ‌నా?
X
తెలంగాణ‌లోనూ రాజ‌న్న రాజ్యం తీసుకువ‌స్తానంటూ.. పార్టీ పెట్టిన వైఎస్ త‌న‌య‌, ఏపీ సీఎం జ‌గ‌న్ సోద‌రి... ష‌ర్మిల విష‌యం మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఆమె.. తాజాగా కాంగ్రెస్ చీఫ్‌.. రేవంత్ రెడ్డిపై నోరు పారే సుకున్నారు. ఆయ‌న‌పై కేసులు ఉన్నాయి. ఆయ‌న రాజ‌కీయాల‌కు ప‌నికిరాడు అంటూ.. కామెంట్లు కుమ్మ రించారు. అంతేకాదు.. కులాల‌ను ప్ర‌స్తావించిన‌.. రేవంత్‌.. కాంగ్రెస్‌కు అధ్య‌క్షుడిగా ప‌నికిరాడ‌ని.. ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లే.. ఇప్పుడు వివాదానికి, విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది.

ష‌ర్మిల‌పై కాంగ్రెస్ నేత‌లు... స‌హా నెటిజ‌న్లు కౌంట‌ర్లు విసురుతున్నారు. వైఎస్సార్ టీపీకి ష‌ర్మిల అధ్య‌క్షు రాలిగా ఉండొచ్చు కానీ, రేవంత్ రెడ్డి ఉండ‌కూడ‌దా? అని ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. అంతేకాదు... రేవంత్ విష‌యాన్ని తీసుకుంటే.. ఆయ‌న రాజ‌కీయాల్లో సొంత‌గా ఎదిగిన నాయ‌కుడు.

అలానే పైకి వ‌చ్చాడు. జెండా లు మోసి.. సాధార‌ణ కార్య‌క‌ర్త‌గా.. ప్ర‌స్తానం ప్రారంభించి.. ఎమ్మెల్యేగా విజ‌యం ద‌క్కించుకున్నారు. మ‌రి ష‌ర్మిల ప‌రిస్థితి ఏంటి? ఆమె త‌న తండ్రి పేరును అడ్డు పెట్టుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌ని అంటున్నారు.

వైఎస్ పేరు లేకుండా... ఆయ‌న జెండా లేకుండా.. ఆయ‌న మాట లేకుండా.. ష‌ర్మిల అస‌లు రాజ‌కీయాల్లో ఉంటారా? అనేది ప్ర‌శ్న‌. అంతేకాదు.. రేవంత్ విష‌యాన్ని తీసుకుంటే.. ఆయ‌న రెండు సార్లు కొడంగ‌ల్ నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఎంపీగా విజ‌యంద‌క్కించుకుని, రాజ‌కీయాల్లో త‌న కుంటూ. ప్ర‌త్యేక‌ముద్ర వేసుకున్నారు. ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా కూడా దూసుకుపోతున్నారు. ష‌ర్మిల ఇంకా వార్డు స‌భ్యుడిగా కూడా నిరూపించుకోలేదు.

అయినా కూడా.. ఆమె బ్రేకింగ్ న్యూస్ కోసం.. షాకింగ్ న్యూస్ కోసం.. వెంప‌ర్లాడుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే సీఎం కేసీఆర్‌, కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిని కార్న‌ర్ చేస్తూ.. విమ‌ర్శ‌లు గుప్పించ‌డం.. అదే ప‌నిగా చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఏమైనా అంటే.. వైఎస్సార్ పేరు చెబుతున్నార‌ని.. కూడా అంటున్నారు. అదే కాంగ్రెస్ నుంచి .. వైఎస్సార్ ముఖ్య‌మంత్రి అయ్యారు. వాళ్ల వ‌ల్ల‌నే ఈ రోజు ష‌ర్మిల రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు.

అంటే.. ప్ర‌త్యక్షంగా.. వైఎస్‌ను ఆమె జ‌పిస్తున్నారంటే.. ప‌రోక్షంగా.. వైఎస్ వ‌చ్చింది కాంగ్రెస్ పార్టీనే క‌దా.. అంటే.. కాంగ్రెస్ వ‌ల్లే క‌దా.. ష‌ర్మిల ఈ రోజు రాజ‌కీయంగా ఉన్నారనే వాద‌న వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి తండ్రి.. రాజ‌కీయాల్లో లేరు. షర్మిల తండ్రి సీఎం. సొంత‌గా పైకి వ‌చ్చిన రేవంత్ రెడ్డిని, కేసీఆర్‌ను తిడితే.. బ్రేకింగ్ న్యూస్‌, షాకింగ్ న్యూస్ వ‌స్తాయో.. ఏమో కానీ, ఓట్లు మాత్రం రావు.. అని స‌మైక్య ష‌ర్మిల తెలుసుకోవాల‌ని తెలంగాణ వాదులు అంటున్నారు.