Begin typing your search above and press return to search.
మన బీమా ధీమా.. విదేశీ చేతుల్లోకి ఖాయం
By: Tupaki Desk | 7 Jan 2022 9:46 AM GMTఇప్పుడంటే పదులకొద్దీ ప్రయివేటు బీమా సంస్థలు వచ్చాయి.. వేలాదిగా ఆకర్షణీయ పథకాలతో ప్రజలను చందాదారులుగా చేర్చుకుంటున్నాయి. మరికొన్ని ఆఫర్లు ప్రకటిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. కానీ, ఒకప్పుడు.. ప్రజలకు బీమా అంటే తెలిసింది ఒక్కటే. అదంటేనే అందరికీ ధీమా. అదుంటేనే అందరికీ భరోసా. అబ్బాయి ఆ సంస్థలో ప్రజలను చేర్పించే ప్రతినిధి పనిచేస్తున్నాడంటే.. అతడు కాస్త గాడినపడినట్టేనని సమాజంలో అభిప్రాయం.
కుర్రాడు ఆ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడంటే అతడికి పిల్లనిచ్చేందుకు పోటీలు పడేవారు. ఇప్పటికీ ప్రయివేటు కంపెనీలు ఎన్నొచ్చినా ఇప్పటికీ అదొక్క దానిపైనే ఎక్కువ శాతం నమ్మకం. వందేళ్లయినా చెక్కుచెదరని ఆ నమ్మకమే జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ). నిండైన భారతీయతకు.. నిఖార్సయిన ప్రతిరూపమైన జీవిత బీమా సంస్థ ఇప్పుడు అధిక శాతం ప్రయివేటు చేతుల్లోకి వెళ్లబోతోంది. బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్‌ఐసీలో వాటా విక్రయానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. తాజాగా వాణిజ్యం, పరిశ్రమల శాఖ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐలు) విధానాల సవరణకు నడుం బిగించింది. ఆర్థిక శాఖ నుంచి సూచనలు, సలహాలు తీసుకున్న తదుపరి ఇందుకు తగిన మార్పులను చేపట్టినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానాలు బీమా రంగంలో స్వయం చాలిత మార్గం ద్వారా 74% విదేశీ పెట్టుబడులను అనుమతిస్తాయి. అయితే ప్రత్యేక చట్టంలో భాగమైన ఎల్‌ఐసీకి ఇవి వర్తించవు. సెబీ నిబంధనల ప్రకారం ఎఫ్‌పీఐ, ఎఫ్‌డీఐలను పబ్లిక్ ఆఫర్ ద్వారా అనుమతిస్తారు. ఎల్‌ఐసీ ప్రత్యేక చట్టంలో విదేశీ పెట్టుబడులకు అవకాశంలేదు.
దీంతో విధానాలలో మార్పులు చేపట్టవలసి ఉంటుంది. జూలైలో ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. మార్చిలోగా ఐపీవోను పూర్తిచేయాలనేది ప్రభుత్వ ప్రణాళిక. అయితే, బీమా రంగానికి చెందిన ప్రస్తుత విధానాలు ఎల్‌ఐసీ పెట్టుబడుల ఉప సంహరణకు అనుమతించవని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ) కార్యదర్శి అనురాగ్ జైన్ తెలియజేశారు. దీంతో మార్గదర్శకాలను సవరించవలసి
ఉన్నదని వివరించారు. వెరసి ఎఫ్‌డీఐ విధానాలు మరింత సరళీకరిస్తున్నట్లు వెల్లడించారు. వీలైనంత త్వరగా సవరించిన విధానాలను ప్రకటించనున్నట్లు తెలియజేశారు. ఈ అంశాలపై ఆర్థిక సర్వీసుల విభాగం, దీపమ్ చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. డీపీఐఐటీ, డీఎఫ్‌ఎస్, దీపమ్ మధ్య చర్చలతో అవసరమైన సవరణలను రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. తదుపరి క్యాబినెట్ అనుమతికి నివేదించనున్నట్లు వెల్లడించారు.
భారతంలో బీమా క్రమం మొదలు ఇలా...
1818: ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రారంభం. మన దేశ భూభాగం నుంచి కార్యకలాపాలు మొదలుపెట్టిన సంస్థ.
1870: బాంబే మ్యూచువల్ లైఫ్ అస్యూరెన్స్ సొసైటీ.. దేశంలో జీవిత బీమా వ్యాపారం మొదలుపెట్టిన సంస్థ.
1912: జీవిత బీమా వ్యాపార క్రమబద్ధీకరణ, చట్టబద్ధం కోసం ది ఇండియన్ లైఫ్ అస్యూరెన్స్ కంపెనీస్ యాక్ట్ అమల్లోకి
1928: జీవిత బీమా,జీవిత బీమాయేతర అవసరాల కోసం చట్టబద్ధ సమాచారం సేకరణకు ది ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యాక్ట్ అమల్లోకి.
1956: 245 భారతీయ, విదేశీ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ సొసైటీలను ఆధీనంలోకి తీసుకుని జాతీయీకరించిన కేంద్ర ప్రభుత్వం. పార్లమెంటులో చేసిన చట్టం మేరకు జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఏర్పాటు. ఇందులో భారత ప్రభుత్వం క్యాపిటల్ కంట్రిబ్యూషన్ కింద రూ.5 కోట్లు పెట్టింది. ఈ మేరకు 1956 సెప్టెంబరు 1న ఎల్ఐసీ ఏర్పాటైంది. ఎల్ఐసీ భారతీయ చట్టబద్ధ బీమా, పెట్టుబడుల కార్పొరేషన్. కేంద్ర ఆర్థిక శాఖ ఆధీనంలో పనిచేస్తుంది.
2019 లెక్కల ప్రకారం ఎల్ఐసీ టోటల్ లైఫ్ ఫండ్ రూ.28.3 ట్రిలియన్లు. సోల్డ్ పాలసీల విలువ 2018-19నాటికి రూ.21.4 మిలియన్లు. ఆ ఏడాది నాటికి ఎల్ఐసీ 26 మిలియన్ల క్లెయిమ్ లను పరిష్కరించింది. 290 మిలియన్ల మంది పాలసీదారులున్నారు.