Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ః శ‌ర‌త్ కుమార్, రాధిక‌కు జైలు శిక్ష‌!

By:  Tupaki Desk   |   7 April 2021 10:34 AM GMT
బ్రేకింగ్ః శ‌ర‌త్ కుమార్, రాధిక‌కు జైలు శిక్ష‌!
X
ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు శ‌ర‌త్ కుమార్‌, న‌టి రాధిక‌కు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. నాలుగు సంవ‌త్సరాలుగా కొన‌సాగిన వాద‌న‌లను స‌మీక్షించి, ఇవాళ తుది తీర్పు వెలువ‌రించింది చెన్నైలోని ప్ర‌త్యేక న్యాయ‌స్థానం.

2015వ సంవ‌త్స‌రంలో రేడియంట్ గ్రూప్ నుంచి రాధిక‌, శ‌ర‌త్ కుమార్ నిర్మాణ సంస్థ రుణాలు తీసుకున్న‌ట్టు స‌మాచారం. అయితే.. స‌ద‌రు సంస్థ తిరిగి చెల్లించాల్సిన రుణాల్లో జాప్యం జ‌రిగిందట‌. దీంతో.. త‌మ రుణాలు తిరిగి చెల్లించాల‌ని రేడియంట్ గ్రూప్ సంస్థ వారిపై ఒత్తిడి చేసింది.

దీంతో.. రాధిక‌, శ‌ర‌త్ కుమార్ ఆ డ‌బ్బుకు చెక్కు రాసి ఇచ్చారట‌. కానీ.. ఆ చెక్కు బౌన్స్ అయ్యిందని స‌మాచారం. దీనిపై రేడియంట్ గ్రూప్ ప్ర‌తినిధులు కోర్టును ఆశ్ర‌యించారు. రుణం చెల్లించ‌క‌పోగా.. బౌన్స్ అయ్యే చెక్కు ఇచ్చార‌ని ఫిర్యాదులో పేర్కొన్న‌ట్టు స‌మాచారం.ఈ విష‌య‌మై గ‌డిచిన నాలుగు సంవ‌త్స‌రాలుగా వాద‌న‌లు సాగాయి. తాజాగా తుది తీర్పు వెలువ‌రించిన న్యాయ‌స్థానం.. రాధిక‌, శ‌ర‌త్ కుమార్ కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన‌ట్టు తెలిసింది.