Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: చంద్రబాబుకు షాకిచ్చిన నిమ్మగడ్డ
By: Tupaki Desk | 4 Feb 2021 4:40 PM GMTఅధికారంలోకి వస్తే భవిష్యత్తులో ఏం చేస్తామో తెలుపుతూ పార్టీ అఫిషియల్‌గా ముద్రించి ఇచ్చే హామీలే 'మేనిఫెస్టోలు'.. వాటికనుగుణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేస్తుంటారు. అయితే.. అదేంటో కానీ తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
40 ఏండ్ల రాజకీయ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు.. పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరిగేవని తెలియదా..? పంచాయతీ ఎన్నికలకు కూడా పార్టీ మేనిఫెస్టో ఉంటుందా..? అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అనే విషయం అంత సీనియర్ లీడర్‌కు తెలియకపోవడం ఏంటి..? అన్నట్టుగానే దీనిపై వైసీపీ ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసింది. దీంతో కమిషనర్ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోను ముద్రించినట్లుగా క్లెయిమ్ చేసుకున్న టీడీపీ కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజుకు నోటీసులు జారీ చేసి వివరణ కోరారు.
ఏపీ పంచాయితీ ఎన్నికల వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ప్రకటించిన తెలుగుదేశం పార్టీ పంచాయితీ ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల కోడ్ కు విరుద్ధమని.. దాన్ని ఉపసంహరించుకోవాలని ఆదేశించింది.మేనిఫెస్టోపై తెలుగు దేశం పార్టీ వివరణ సంతృప్తికరంగా లేదని స్పష్టం చేసింది. జిల్లాలకు పంపిన మేనిఫెస్టో కాపీలను వెనక్కి తీసుకోవాలని.. మేనిఫెస్టోతో ఎలాంటి ప్రచారం నిర్వహించవద్దని ఆదేశించింది.