Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: హుజూర్ నగర్ లో టీడీపీ రేటు రూ.100.?
By: Tupaki Desk | 19 Oct 2019 1:22 PM GMTహుజూర్ నగర్.. తెలంగాణలో జరుగుతున్న ఏకైక ఉప ఎన్నిక కాకరేపుతోంది. సిట్టింగ్ స్థానమైన హుజూర్ నగర్ ను దక్కించుకోవాలని కాంగ్రెస్, ఇజ్జిత్ కా సవాల్ గా టీఆర్ఎస్ భావిస్తూ హోరాహరీగా పోరాడుతున్నాయి. ఇవే కాదు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన బలాన్ని అంతా ఉపయోగించుకొని ఈసీ అధికారులతో కలిసి టీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తోంది.
ఇక గుడ్డిలో మెల్లిలా ఆంధ్రా సరిహద్దు ప్రాంతం కావడంతో టీడీపీ కూడా బరిలోకి దిగింది. పోయిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిలో కలిసి కట్టుగా పోటీచేసిన కాంగ్రెస్-టీడీపీలు ఈసారి విడిపోయి వేరువేరుగా బరిలోకి దిగాయి.
ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ హుజూర్ నగర్ సీటులో బలమైన ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్యను గెలిపించుకోవడానికి ఎంతకైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏకంగా ఓటుకు రూ.3000 నుంచి రూ.5000 వరకు ఓటర్లకు పంచడానికి కాంగ్రెస్ శ్రేణులు రెడీ అయ్యాయన్న ప్రచారం నియోజకవర్గంలో విస్తృతంగా సాగుతోంది.
ఇక కాంగ్రెస్ కు పోటీగా అధికార టీఆర్ఎస్ కూడా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదట.. గులాబీ పార్టీ కూడా 3వేల నుంచి 5 వేల దాకా ఓట్ల కోసం వెదజల్లడానికి రెడీ అయ్యిందన్న ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ , టీఆర్ఎస్ పోటాపోటీగా పైసలు వెదజల్లేందుకు రెడీ కావడంతో హుజూర్ నగర్ ఓటర్లు తడిసి ముద్దవ్వడం ఖాయంగా కనిపిస్తోంది..
అయితే ఈ రెండు పార్టీలకు భిన్నంగా ఇక్కడ ఆంధ్రా ప్రాబల్యాన్ని ఓట్లుగా మలుచుకునేందుకు బరిలోకి దిగిన తెలుగు దేశం పార్టీ కూడా పైసలు పంచడానికి రెడీ అయ్యిందట.. కానీ వారు పంచుతున్న మొత్తం చూసి ఓటర్లు షాక్ కు గురి అవుతున్నారట.. ఓటుకు రూ.100 చొప్పున టీడీపీ నేతలు పంచడానికి రెడీ అయ్యారట.. ఈ 100 రూపాయలకు క్వార్టర్ కూడా రాదంటూ ఓటర్లు టీడీపీ నేతల ముఖం మీదే చెబుతూ చీదరించుకుంటున్నారని విషయం బయటకు పొక్కుతోంది..
టీఆర్ఎస్, కాంగ్రెస్ లు రూ.3వేల నుంచి రూ.5వేల చొప్పున పంచుతుంటే టీడీపీ నేతలు మాత్రం రూ.100 చొప్పున పంచడం చూసి నేతలు, ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారట.. తెలంగాణలో ఉనికే లేని టీడీపీ ఇంతకంటే ఎక్కువ పంచి మునిగిపోవడం ఎందుకనో లేక.. పంచలేదన్న అపవాదు ఉండకూడదని కాబోలు రూ.100 అయినా పంచుతూ స్వయం సంతృప్తి పొందుతున్నట్టు తెలుస్తోంది. ఏదీ ఏమైనా రూ.100 పంచుతున్న టీడీపీ అనే ప్రచారం హుజూర్ నగర్ లో ఇప్పుడు ఏ నోట విన్న వినిపిస్తోంది.