Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ః రాష్ట్రంలో టెన్త్ ప‌రీక్ష‌లు ర‌ద్దు.. ఇంట‌ర్ వాయిదా!

By:  Tupaki Desk   |   15 April 2021 1:05 PM GMT
బ్రేకింగ్ః రాష్ట్రంలో టెన్త్ ప‌రీక్ష‌లు ర‌ద్దు.. ఇంట‌ర్ వాయిదా!
X
క‌రోనా సెంక‌డ్ వేవ్ విజృంభిస్తున్న వేళ టెన్త్ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాల‌ని తెలంగాణ‌ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇప్ప‌టికే సీబీఎస్ఈ పరీక్ష‌లు ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. రోజురోజుకూ పెరుగుతున్న కేసుల ఉధృతిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ స‌ర్కారు కూడా ర‌ద్దుకే మొగ్గు చూపింది.

రాష్ట్రంలో దాదాపుగా 5 ల‌క్ష‌ల 35 వేల మంది టెన్త్ విద్యార్థులు ఉన్నారు. వీరంద‌రినీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌కుండానే పై త‌ర‌గ‌తికి ప్ర‌మోట్ చేయాల‌ని నిర్ణ‌యించింది ప్ర‌భుత్వం. అయితే.. ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల‌ను మాత్రం వాయిదా వేస్తున్న‌ట్టు వెల్ల‌డించింది.

క‌రోనా తీవ్ర‌త త‌గ్గిన త‌ర్వాత ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. ఈ మేర‌కు విద్యాశాఖ పంపిన ఈ ఫైల్ పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంత‌కం చేసిన‌ట్టు స‌మాచారం. కాగా.. గ‌త ఏడాది కూడా ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. ఇంట‌ర్న‌ల్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయించారు.