Begin typing your search above and press return to search.
బ్రేకింగ్.. చిక్కుముడులు వీడాయి.. సేనకే సీఎం పోస్టు!
By: Tupaki Desk | 15 Nov 2019 6:27 AM GMTఊహించనిరీతిలో మలుపులు తిరిగిన మహారాష్ట్ర రాజకీయం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. రాజకీయం క్రికెట్ క్రీడలాంటిదేనని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే మహారాష్ట్ర రాజకీయంలో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. క్రికెట్ ఆటలో ఒక్కోసారి ఓడిపోతారనుకున్న వారు కూడా గెలుస్తారన్న మాటకు తగ్గట్లే శివసేన తీరు ఉందని చెప్పాలి.
ఈసారి తమకు సీఎం పదవి ఇవ్వాలంటూ పట్టుపట్టి.. సుదీర్ఘ మిత్రత్వాన్ని వదిలేసుకోవటమే కాదు.. కొత్త మిత్రుల కోసం వారు పడిన తపన ఒక కొలిక్కి రావటమే కాదు.. కొత్త మిత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఒప్పందం జరిగినట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వాన్ని శివసేన..ఎన్సీపీ.. కాంగ్రెస్ లు కలిసి చేపడతాయని చెబుతున్నారు.
కీలక పదవుల పంపకాల విషయంలో మూడు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. శివసేనకు ఐదేళ్ల పాటు సీఎం పీఠాన్ని ఇచ్చేందుకు ఎన్సీపీ.. కాంగ్రెస్ పార్టీలు అంగీకారానికి రావటంతో పాటు.. కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ పదవి.. ఎన్సీపీకి మండలి ఛైర్మన్ పదవి ఇచ్చేందుకు సేన ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన పదవులకు సంబంధించి మూడు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలకు లేకుండా.. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పార్టీల మధ్య సామరస్యవాతావరణంలో ఒప్పందం జరిగినట్లుగా సమాచారం. మహారాష్ట్ర సీఎం పదవితో పాటు శివసేనకు 14 మంత్రి పదవులు తీసుకోనున్నారు. ఎన్సీపీ విషయానికి వస్తే డిప్యూటీ సీఎం పదవితో పాటు 14 మంత్రి పదవులు.. కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ సీఎం పదవితో పాటు 12 మంత్రి పదవులు తీసుకునేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం.
సీఎం పదవిని శివసేన.. ఎన్సీపీలు చెరో రెండున్నరేళ్లు పంచుకునేందుకు ఒప్పందం జరిగిందన్న ప్రచారానికి విరుద్ధంగా.. పూర్తికాలం పాటు శివసేనకే సీఎం పదవిని ఇచ్చేందుకు ఎన్సీపీ.. కాంగ్రెస్ లు సిద్ధం కావటం ఆసక్తికరంగా మారింది. తాజాగా కొత్త మిత్రపక్షాలతో జరిగిన ఒప్పందాన్ని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈ రోజు (శుక్రవారం) వెల్లడిస్తారని చెబుతున్నారు. అదే జరిగితే.. గవర్నర్ వద్దకు వెళ్లటం.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని చూపించటం లాంటి సాంకేతిక అంశాలు రెండురోజుల్లో పూర్తి చేయటంతో పాటు.. ప్రభుత్వాన్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు. ఈ పరిణామం మోడీషాలకు మింగుడుపడనిది మారుతుందని చెప్పక తప్పదు.