Begin typing your search above and press return to search.

తిరుపతి వైసీపీదే.. బీజీపీకి నోటా కంటే ఎక్కువ

By:  Tupaki Desk   |   2 May 2021 10:22 AM GMT
తిరుపతి వైసీపీదే.. బీజీపీకి నోటా కంటే ఎక్కువ
X
తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తన సమీప ప్రత్యర్థి టీడీపీకి చెందిన పనబాక లక్ష్మీపై గెలుపొందారు.

వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 2,25,773 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి గురుమూర్తి ఆధిక్యం కనబరుచాడు.. టీడీపీ రెండో స్థానం.. బీజేపీ-జనసేన మూడో స్థానానికి పరిమితమైంది.

అందరూ ఊహించినట్టుగా ఇక్కడ వైసీపీ 5 లక్షల మెజారిటీతో గెలుస్తుందని అనుకున్నా అది సాధ్యం కాలేదు. కేవలం 2 లక్షలకు పైచిలుకు ఓట్లు మాత్రమే సాధ్యమయ్యాయి.

ఇక బీజేపీ సత్తా చాటుతుందని ఆశించినా పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ పోయిన సారి ఎన్నికల్లో బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఈసారి బీజేపీ శ్రేణులు కాస్త శ్రమించడంతో నోటాను మించి ఓట్లు సంపాదించడం విశేషం.

దివంగత ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ సాధించిన 2.28 ఓట్ల మెజారిటీ కంటే గురుమూర్తి అధిగమించారు. గురుమూర్తికి 5.33 లక్షల ఓట్లు రాగా.. పనబాక లక్ష్మీకి దాదాపు 3 లక్షల ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 50వేల ఓట్లు వచ్చినట్టు సమాచారం.