Begin typing your search above and press return to search.
బిడ్డకు ఇలా పాలిచ్చిన తల్లి.. ఫొటో వైరల్
By: Tupaki Desk | 12 Aug 2018 8:54 AM GMTతల్లి ప్రేమకు కొలమానం లేదు.. బిడ్డ ఆకలి తీర్చడాన్ని తల్లి మధురానుభూతిగా భావిస్తుంది. ఇంట్లో అయితే ఓకే. మరి బహిరంగ ప్రదేశాల్లో బిడ్డలకు పాలు ఎలా ఇస్తాం.? అందరూ చూస్తుండగా ఆ పని ఎలా చేస్తాం.. పోనీ పాలిచ్చినా కూడా కొంతమంది ఆడిపోసుకుంటూనే ఉంటారు.. కానీ ఈ మహిళ భయపడలేదు... బహిరంగంగా పాలు ఇస్తున్నావ్ కదా.. కాస్త జాగ్రత్త తీసుకో అన్న వ్యక్తికి అదిరిపోయే షాక్ ఇచ్చింది. బిడ్డకు ఆకలి బహిరంగంగా తీరుస్తూ తన అభిమానాన్ని కోల్పోకుండా వ్యవహరించింది. ఈ తల్లి చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. నెటిజన్లందరూ ఈమె చర్యకు శభాష్ అంటూ కీర్తిస్తున్నారు.
మెక్సికోలోని కాబోశాన్కాస్ కు చెందిన మెలానీ డడ్లీ అనే మహిళ ఇటీవల ఓ రెస్టారెంట్ కు కుటుంబంతో కలిసి వెళ్లింది. అక్కడ ఆమె నాలుగు నెలల బాబు ఆకలితో పాలు కావాలంటూ ఏడుస్తున్నాడు. దీంతో ఆ తల్లి అంత పెద్ద రెస్టారెంట్ లో అందరూ చూస్తుండగానే చనుబాలు అందించి పాలివ్వడం మొదలుపెట్టింది. ఆమె ముందునుంచి వెళ్తున్న వ్యక్తి ఒకరు ‘కవర్ చేసుకోండి’ అని ఆమె కు సూచించాడు. దీంతో ఆమె తన డ్రెస్ కొంగును బిడ్డపై కప్పకుండా తన తల ముఖం మొత్తం కనపడుకుండా కప్పేసుకొని బిడ్డకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పాలిచ్చింది.
మెలానీ ఫ్యామిలీ ఫ్రెండ్ కారల్ లాక్ వుడ్ ఈ ఫొటోను తీసి మెలానీ అనుమతితో ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. ఆమె చేసిన మంచి పనికి మెచ్చుకుంటూ వ్యాఖ్యలు రాశారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందన వచ్చింది. సమయస్ఫూర్తితో మెలానీ బిడ్డకు డిస్ట్రబ్ కాకుండా తనను కవర్ చేసుకోవడాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. బహిరంగ స్థలాల్లో పాలు ఇవ్వడంలో పడే ఇబ్బందిని చూసి తాను చేసిన ఈ పని అందరికీ స్ఫూర్తిగా నిలిచిందని.. మహిళలు సిగ్గు పడకూడదంటూ మెలానీ చెప్పుకొచ్చింది. తాను చేసిన పనికి గర్వపడుతున్నానని తెలిపింది.