Begin typing your search above and press return to search.
ముసుగు తీసేయ్.. బ్రెల్ఫీ షేర్ చేయ్
By: Tupaki Desk | 1 Aug 2016 12:02 PM GMTచంటిపిల్లకు పాలిస్తే కొంగు కప్పుకుంటారు తల్లులు. ఎవరూ చూడకుండా చాటుకుపోయి పాలిస్తారు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అయితే చంటిపిల్లల తల్లులకు ఈ సమస్య రాకుండా బస్టాండుల్లో పిల్లలకు పాలిచ్చేందుకు వీలుగా ప్రత్యేక గదులు కట్టించింది జయలలిత ప్రభుత్వం.పిల్లలకు తల్లిపాలు ఎంతో అవసరమైన తరునంలో పాలివ్వడం అనేది పెద్ద ప్రహసంగా మారిపోవడం బాధాకరమే. అయితే.. సమాజం చూసే కోణం వేరు కాబట్టి చంటిపిల్లల తల్లులు ఎలాంటి సంకోచం లేకుండా ఎక్కడపడితే అక్కడ తమ పిల్లలకు పాలిచ్చే పరిస్థితులు లేవు. కానీ... ఐక్యరాజ్యసమితి మాత్రం ఇకపై అలాంటి సంకోచాలు వద్దంటోంది. పిల్లలకు తల్లి పాలు అందితేనా పిల్లలు సంపూర్ణంగా ఎదుగుతారని.. అప్పుడే ఆరోగ్యం కరమైన సమాజం తయారవుతుందని చెబుతోంది. అంతేకాదు.. తల్లిపాలను ప్రోత్సహించడానికి గాను ఐరాస కొత్త ఆలోచన చేసింది. తల్లులు తమ పిల్లలకు పాలిస్తున్న చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని ప్రోత్సహిస్తోంది.
ప్రపచంలోని పిల్లల్లో 77 మిలియన్ల మంది తల్లిపాలకు నోచుకోవడం లేదట. మొత్తం పిల్లల్లో వీరి శాతం దాదాపు సగం. తల్లిపాలు వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి. పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా బిడ్డ మానసిక - శారీరక ఎదుగుదలకు అది ఎతో మేలు చేస్తుంది. కానీ, చాలామంది తల్లులు పిల్లలకు పాలివ్వడానికి ఇష్టపడడం లేదు. అందుకే ఐరాస స్పందించి తల్లిపాలను ప్రోత్సహిస్తోంది. ప్రపంచమంతా సెల్ఫీల మోజులో పడిన తరునంలో పిల్లలకు పాలిచ్చే చిత్రాలు(బ్రెల్ఫీలు) పెట్టాలంటూ పిలుపునిస్తోంది.
సోమవారం నుంచి తల్లిపాల వారోత్సవాలు ప్రారంభమైన తరుణంలో ఐరాస కొద్దిరోజుల ముందే ఈ ఇనిషియేటివ్ తీసుకుంది. తల్లిపాలతో కలిగే ప్రయోజనాలు వివరిస్తూ బ్రెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్టు చేయాలంటూ ప్రపంచ దేశాల తల్లులను కోరింది. మరి ఎంతమంది స్పందిస్తారో చూడాలి. పాశ్చాత్య దేశాల్లో స్పందన ఉండొచ్చు కానీ మన దేశంలో అంతగా ఉండదని తెలుస్తోంది. ఏదేమైనా సెల్ఫీల్లో ఈ కొత్త ప్రయోజనం ఆహ్వానించదగినదే. ఆరోగ్యవంతమైన సమాజం కోసం అమ్మలు తాము పాలిస్తున్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తే 750 కోట్ల ప్రపంచ జనాభా వారికి సెల్యూట్ చేయాల్సిందే.