Begin typing your search above and press return to search.
సెంచరీల్లో సచిన్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడు..!
By: Tupaki Desk | 26 April 2020 6:56 AM GMTక్రికెట్ దేవుడు అంటే గుర్తొచ్చేది సచిన్ టెండూల్కర్. ఆయన బ్యాట్ పడితే ఫోర్లు, సిక్స్‌లే. ఆ విధంగా బాదేస్తూనే తన కెరీర్ చివరి రోజుల్లో ఏకంగా వంద సెంచరీల రికార్డును పూర్తి చేశాడు. ఆ రికార్డును ఎవరూ బ్రేక్ చేసే అవకాశం లేదు. కానీ ఆ రికార్డును బ్రేక్ చేసే సత్తా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉందని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ తెలిపారు. కోహ్లీ ఇప్పటికే పరుగుల వర్షం కురిపిస్తున్నాడని, తన నైపుణ్యం - ఫిట్ నెస్ - మానసిక బలంతో ఇప్పుడు ఎలాంటి రికార్డులనైనా బద్దలు కొడతాడని కొనియాడారు.
బ్రెట్ లీ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో పేస్ బౌలర్‌గా సత్తా చాటాడు. మొత్తం 76 టెస్టుల్లో 310 వికెట్లు - 221 వన్డేల్లో 380 వికెట్లు తీసి తిరుగులేని బౌలర్‌గా నిలిచాడు. అలాంటి బ్రెట్ లీ ఇటీవల 'స్టార్ స్పోర్ట్స్' క్రికెట్ కనెక్టెడ్ షోలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా భారత క్రికెట్ జట్టుపై - విరాట్ కోహ్లీపై స్పందించారు. ఒకప్పుడు సచిన్ లో ఉన్న లక్షణాలు ఇప్పుడు కోహ్లీలో ఉన్నాయని తెలిపారు. కోహ్లీకి ఎంతో నైపుణ్యం ఉందని - ఫిట్ నెస్ - తన మానసిక బలంతో కఠిన మ్యాచ్ ల్లోనూ రాణిస్తున్నాడని కొనియాడారు. క్రికెట్ దేవుడు సచిన్ అని - అతడిని దాటి వెళ్లే సత్తా ఎవరికి లేదని స్పష్టం చేశాడు. అయితే ఇప్పుడు ఫామ్‌లో ఉన్న కోహ్లీ ఇదే తీరున కొనసాగితే వచ్చే 7-8 సంవత్సరాల్లో సచిన్ రికార్డు వంద సెంచరీలను కోహ్లీ సాధిస్తాడని చెప్పారు.
సచిన్ టెండూల్కర్ మాదిరి టెస్టుల్లో కోహ్లీ రాణిస్తున్నాడని పేర్కొన్నారు. 200 టెస్టుల్లో 15,921 పరుగులు సచిన్ చేయగా వాటిలో 51 సెంచరీలు ఉన్నాయి. 463 వన్డేల్లో 49 సెంచరీలు చేసిన అతడు 18,426 పరుగులు సాధించాడని వివరించారు. విరాట్ కోహ్లీ 86 టెస్టుల్లో 27 సెంచరీలతో 7,240 పరుగులు, 248 వన్డేల్లో 43 సెంచరీలతో 11,867 పరుగులు చేశాడు. ఈ లెక్కలను పరిశీలిస్తే ఇప్పటికే సచిన్ వంద సెంచరీల రికార్డుకు విరాట్ చేరువలో ఉన్నారని చెప్పవచ్చని తెలిపారు. సచిన్ రికార్డుకు కోహ్లీ కేవలం 30 సెంచరీల దూరంలో ఉన్నాడని వివరించారు.