Begin typing your search above and press return to search.
బ్రిటనోడి దెబ్బ మన మీద ఎంత పడిందంటే..
By: Tupaki Desk | 24 Jun 2016 9:28 AM GMTకొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తెల్లోడి మళ్లీ ప్రపంచాన్ని వణికించాడు. శతాబ్దాల పూర్వం రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం ప్రపంచాన్ని ప్రభావితం చేసిన విషయాన్ని చరిత్రలో చదువుకున్నప్పుడు.. అప్పుడంటే కానీ.. ఇప్పడంత సీన్ లేదని ఫీలయ్యే వాళ్లు చాలామందే ఉన్నారు. అమెరికావోడి ముందు బ్రిటన్ ఏపాటిది? అని ఫీలయ్యే వాళ్లూ ఉన్నారు. కానీ.. బ్రిటీషోడు కనిపించడు కానీ ఖతర్నాక్ అన్న విషయం మరోసారి రుజువైంది. అక్కడి వాడి మనసులో పుట్టిన స్వార్థం.. ఈ రోజు ప్రపంచ ఆర్థిక చిత్రపటానికి చిరుగులు పట్టేలా చేసిన తీరు చూస్తే.. వామ్మో బ్రిటీషోడు అనుకోవాల్సిందే.
27 దేశాల యూరోపియన్ కూటమిలో ఉండటం వల్ల.. ప్రతి వారం తాము పెద్ద ఎత్తున డబ్బును యూరోపియన్ సమాఖ్యకు ఇవ్వాల్సి వస్తోందని.. తాము సంపాదించే రెండు పౌండ్లలో ఒక పౌండ్ ను సమాఖ్యకు ఇవ్వటం ఏమిటి చెత్తగా? అని ఫీలయ్యారు. అలా అనుకోవటం ఒక ఎత్తు అయితే.. అది కాస్త ఒక వాదనగా మారి.. ఈ విషయం మీద లెక్క తేలాల్సిందే? దేశ వ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించాలంటూ డిమాండ్ పెద్దది కావటంతో అభిప్రాయ సేకరణను ఎన్నికల రూపంలో చేపట్టారు. చుట్టూ ఉన్న నలుగురు బాగుండాలని.. అందరూ కలిసి ఉంటేనే కలదు సుఖం అన్న మాటలు తెల్లోడికి అస్సలు పట్టక.. స్వార్థంతో ఎన్నికలకు వెళుతున్న వేళ.. ఇలాంటి వైఖరి పెను పరిణామాలకు దారి తీస్తుందని.. పక్కనోడిని దెబ్బేసే క్రమంలో మీరు కూడా దెబ్బ తింటారని బ్రిటీషర్లకు ఆర్థిక వేత్తలు వార్నింగ్ ఇచ్చారు.
చివరకు.. బ్రిటన్ ప్రధాని కామెరన్ సైతం.. ఇలాంటి పోకడలు మంచివి కావు.. విమానంలో ప్రయాణించే సమయంలో మధ్యలో దూకేయటం ఏ మాత్రం మంచిది కాదు.. ఒకవేళ దూకేస్తే.. భవిష్యత్తులో ఎప్పటికి విమానంలో ఎక్కటం సాధ్యం కాదని చెబుతూ.. తన మాటలు దేశ ప్రజలు వినాలని కోరారు. కానీ.. అవేమీ వినిపించని బ్రిటీషర్లు తమ స్వార్థాన్ని మరోసారి ప్రదర్శించారు. బ్రెడ్జెట్ కు అనుకూలంగా ఓటు వేయటం ద్వారా యూరోపియన్ దేశాల సమాఖ్య నుంచి బ్రిటన్ ఎగ్జిట్ కావటం ఖాయమైంది. ఈ పరిణామం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని తీవ్రంగా ప్రభావితం చూసింది.
అలా ప్రభావితం చెందినోళ్లలో మనం కూడా ఉన్నాం. బ్రిటన్ లో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో పెట్టుబడులు వేగంగా వెనక్కి వెళ్లిపోవటమే కాదు.. టాటా లాంటి కంపెనీలు బ్రిటన్ లో పెట్టిన పెట్టుబడులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న అంచనాలు స్టాక్ మార్కెట్ ను షేక్ చేశాయి. జ్వరం వచ్చినట్లుగా సెన్సెక్స్ వణికిపోయింది. నిఫ్టీకి సైతం చెమటలు పడ్డాయి. దీంతో.. సెన్సెక్స్ భారీగా నష్టపోయి వెయ్యి పాయింట్లకు కాస్త కుడిఎడంగా పడిపోతే.. నిఫ్టీ 300 పాయింట్లను కోల్పోయింది. ఈ మొత్తం కారణంగా మార్కెట్లోని మదుపరుల సొమ్ము దాదాపు రూ.4లక్షల కోట్లకు పైనే ఆవిరి అయిన పరిస్థితి. ఒక్క స్టాక్ మార్కెట్ మాత్రమే కాదు.. డాలర్ తో రూపాయి మారకం విలువ ఏకంగా 83 పైసలు నష్టపోయింది.ఈ నష్టం ఒక దశలో వంద పైసలు వరకూ వెళ్లటం గమనార్హం.
ఇవి చాలవన్నట్లుగా.. ముందు ఊహించినట్లే మదుపరులు బంగారం.. వెండిని భారీగా కొనుగోలు చేస్తారని.. వాటి మీద పెట్టుబడులు పెడతారన్న అంచనాలకు తగ్గట్లే.. బంగారం భారీగా పెరిగింది. బ్రెగ్జిట్ ఫలితాలు వెలువడుతున్న వేళ.. బంగారం ధర పదిగ్రాములు రూ1700 మేర పెరగ్గా.. వెండి కేజీ రూ.13వేలకు పెరిగింది. మొత్తంగా అక్కడెక్కడో ఉన్న బ్రిటీషోడు దేశ ఆర్థిక వ్యవస్థను భారీగా దెబ్బేశాడనే చెప్పాలి. మరి.. ఈ నష్టాలన్నీ ఎప్పటికి రికవరీ అవుతాయో చూడాలి.