Begin typing your search above and press return to search.
పెళ్లైన గంటల వ్యవధిలోనే పెళ్లి కూతురు ఆత్మహత్య !
By: Tupaki Desk | 15 Jun 2020 11:30 PM GMTకుటుంబ సభ్యులు , బంధుమిత్రులు కలిసి అప్పటివరకు ఎంతో సంతోషంగా పెళ్లి చేసారు. ఆ తరువాత అప్పగింతలు పూర్తి చేసి, నవవధువును అత్తారింటికి అనందంగా సాగనంపారు. అయితే , వెళ్లేదారిలో ఓ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది పెళ్లికూతురు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షియోపూర్‌లో చోటు చేసుకుంది.
ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ...రాజస్తాన్ అలపుర్ కు చెందిన ఓ యువతికి ఆదివారం బంధువులు సన్నిహితుల మధ్య ఘనంగా పెళ్లైంది. ఆ తర్వాత ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో పెళ్లి కూతురిని అత్తారింటికి సాగనంపారు పుట్టింటివారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో కారు మధ్యప్రదేశ్, షియోపూర్ చంబల్ నది వంతెనపై ప్రయాణిస్తుంది. అంతలొనే తనకు వాంతి వస్తోందని, కారు ఆపాలని వధువు డ్రైవర్ ను కోరింది. అయితే డ్రైవర్ అనుమానపడుతూనే అందుకు ఒప్పుకోలేదు.
దీంతో ఆమె ఒక్కసారిగా స్టీరింగ్‌ను గట్టిగా పట్టుకుని తిప్పేసింది. దీంతో డ్రైవర్ సడన్ బ్రేకులు వేశాడు. పెళ్లికుమారుడు, అతడి తల్లిదండ్రులు ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే వధువు కారులోంచి కిందకి దిగి, వంతెనపై నుంచి నదిలోకి దూకేసింది. ఈ హఠాత్తు పరిణామంతో వరుడుతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో వధువు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పెళ్లి జరిగే సమయంలో అంతా సవ్యంగానే ఉందని ..ఇంతలో ఏం జరిగిందో తమకు తెలియడం లేదని వధువు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.