Begin typing your search above and press return to search.

వధూవరుల మధ్య పోటీ.. ఎవరు గెలిచారంటే..? వీడియో వైరల్..

By:  Tupaki Desk   |   10 Aug 2022 5:40 AM GMT
వధూవరుల మధ్య పోటీ.. ఎవరు గెలిచారంటే..? వీడియో వైరల్..
X
భారతీయ పెళ్లిళ్లు చాలా సరదాగా ఉంటాయి. జీవితంలో ఒకేసారి ఈ వేడుక జరగుతుంది కనుక.. దీనిని ఆడంబరంగా నిర్వహించుకుంటారు. భిన్న సంస్కృతులకు గల భారత్ లో ఆయా ప్రాంతాలను భట్టి వివిధ పద్ధతుల్లో వివాహాలు జరుగుతూ ఉంటాయి. హిందూ కుటుంబాల్లో పెళ్లి వేడుక ఒక పెద్ద ఫెస్టివల్. స్థోమతను భట్టి ఈ వేడుకను ఐదు నుంచి పది రోజుల వరకు నిర్వహించుకుంటున్నారు. రెండు కుటుంబాల మధ్య వివాహం నిశ్చయం అయిన నాటి నుంచి రిసెప్షన్ వరకు రెండు కుటుంబాల్లో హంగామా ఉంటుంది.

అయితే భారత్ కు సరిహద్దులో ఉన్న నేపాల్ దేశంలోని కొన్ని సంస్కృతులు భారత్ కు అనుగుణంగానే ఉంటాయి. ఇక్కడ జరిగిన ఓ వివాహ వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిమిషాల్లోనే ఈ వీడియోను 80 వేల మంది లైక్ చేశారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది..?

మనదేశంలో పెళ్లిళ్లు చాలా సాంప్రదాయంగా నిర్వహిస్తూ ఉంటారు. నిశ్చితార్థం నుంచి అసలు అంకం మొదలవుతుంది. ఇక పెళ్లికి ముందు సంగీత్, మంగళ స్నానాలు లాంటి కార్యక్రమాలు ఇప్పుడు కచ్చితంగా నిర్వహిస్తున్నారు. అలాగే పెళ్లి కూడా చాలా సరదాగా జరుపుకుంటున్నారు. ఈ పెళ్లి వేడుకలో వధూ, వరుల స్నేహితులు తమ పెళ్లి చేసుకోబోయే వారిని ఆటపట్టిస్తూ ఉంటారు.

ఈ క్రమంలో వారు కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులు అక్కడ ఫన్నీగా మారుతుంటాయి. ముఖ్యంగా మన తెలుగు పెళ్లిళ్లలో తలంబ్రాలు పోసే కార్యక్రమం గురించి అందరికీ తెలిసిందే. వధూ వరులు పోటీ పడి మరీ చివరి తలంబ్రాలను ఎదుటి వారిపై వేసేలా ప్రయత్నిస్తుంటారు.

ఇలాగే నేపాల్ లోని వధూ వరులు ఓ మూమెంట్ చేయబోయారు. అయితే అక్కడ జరిగిన ఓ ఇన్సిడెంట్ నవ్వులు పూయించింది. ఇక్కడ జరిగిన వివాహంలో వధూవరులు ఒకరికొకరు మిఠాయి తినిపించుకోవాలి. ఎవరు ముందుగా తినిపిస్తే వారిదే పైచేయి అన్నట్లు భావిస్తారు. ఈ క్రమంలో ఇద్దరూ పోటీ పడుతుంటారు. అయితే ఇక్కడ వధువు ముందుగా మిఠాయి తినిపించాలని కాస్త ఆవేశ పడింది. కానీ ఇంతలో కాలు స్లిప్పయి వరుడిపై పడుతుంటుంది. అప్పటికే సెల్ కెమెరాలతో రెడీగా ఉన్న కొందరు ఈ వీడియోను మరింత ఆసక్తిగా చిత్రీకరించారు.

ఇంకేముందీ ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అయితే దీనికి నిమిషాల్లోనే 80000 లైక్స్ వచ్చాయి. ఇంతలా ఫాస్ట్ గా మూవ్ అయిన ఈ వీడియో గురించి తెగ చర్చించుకుంటున్నారు. పెళ్లి ఎంత సంతోషంగా జరుపుకుంటే జీవితం అంత హాయిగా ఉంటుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ‘ఇది దీపక్ కలాల్, రాఖీ సావంత్ వీడియో’ అంటూ కామెంట్ పెట్టారు. ఇలా రకరకాల కామెంట్లతో ఈ వీడియో వైరల్ గా మారింది.