Begin typing your search above and press return to search.
ఘనంగా పెళ్లి.. నిబంధనల ఉల్లంఘనతో జైలులో కాపురం
By: Tupaki Desk | 7 July 2020 1:30 AM GMTవైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. అయినా ప్రజలు నిర్లక్ష్యం వీడడం లేదు. ఈ సమయంలో శుభాకార్యాలు, విందులు, వినోదాలు మానేసి సాధ్యమైనంత వరకు ఇళ్లల్లోనే ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయినా ప్రజలు వినడం లేదు. ప్రభుత్వ ఆంక్షలను ఉల్లంఘించి వైరస్ వ్యాప్తికి కారణాలవుతున్నారు. పెళ్లంటే సాధారణ రోజుల్లో అంగరంగ వైభవంగా ఎవరి తాహత్తుకు తగ్గట్టు వారు చేసుకుంటారు. కానీ ఇప్పుడు అలా చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. దీన్ని ఉల్లంఘించిన పెళ్లికొడుకు.. వారి కుటుంబసభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి అనంతరం భారీ ఎత్తున బరాత్ (ఊరేగింపు) చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకు రావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్న ఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది.
ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో ఓ పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లిళ్లు.. శుభాకార్యాలపై నిషేధం ఉన్నా వీరు నిబంధనలు ఉల్లంఘించి వైభవంగా వివాహం జరిపించారు. అనంతరం సాయంకాలం నుంచి రాత్రి వరకు బరాత్ (ఊరేగింపు) నిర్వహించారు. పాటలు.. డప్పుచప్పుళ్లకు కుటుంబసభ్యులు.. బంధువులు.. స్నేహితులు ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేస్తూ ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలో వైరస్ వ్యాపిస్తుందనే విషయం మరచిపోయారు. ఒక్కరూ కూడా మాస్క్‌లు ధరించకపోవడం.. సామాజిక దూరం పాటించలేదు. అయితే వీరు ఎంజాయ్ చేస్తూ వీడియోలు.. ఫొటోలు తీసుకున్నారు. వాటిని సోషల్ మీడియాలో పంచుకోవడంతో పోలీసుల దృష్టికి వచ్చింది. ఎవరూ నిబంధనలు పాటించకపోవడం.. సామూహికంగా ఉండడం.. మాస్క్‌లు ధరించకపోవడాన్ని పోలీసులు గుర్తించి వెంటనే రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా పెళ్లి కొడుకుతో పాటు అతడి తండ్రి, ముగ్గురు మామయ్యలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పెళ్లి జరిగిన హోటల్ ను సీజ్ చేశారు. వారిపై ఐపీసీ 188.. 269.. 270 సెక్షన్లతో పాటు ఎపిడమిక్ డిసిజ్ యాక్ట్ 34 కింద కేసు నమోదు చేసినట్లు గంజాం జిల్లా ఎస్పీ పినాక్ మిశ్రా తెలిపారు. ప్రజలెవరూ శుభాకార్యాలు.. విందు.. వినోదాలు చేసుకోవద్దని.. ఒకవేళ చేసుకున్నా నిబంధనలకు అనుగుణంగా కొద్దిమందితో మాత్రమే చేసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.