Begin typing your search above and press return to search.
డెంగ్యూతో ప్రాణాలొదిలిన పెళ్లికూతురు
By: Tupaki Desk | 2 Nov 2019 8:54 AM GMTతెలుగు రాష్ట్రాలను డెంగ్యూ జ్వరాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువతి.. డెంగ్యూతో మృతి చెందడం చిత్తూరు జిల్లాకు చెందిన ఓ కుటుంబంలో విషాదం నింపింది. పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిన కూతురిని స్మశానానికి తీసుకెళ్లాల్సి రావడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదనని ఆపడం ఎవరితరం కావడంలేదు. దీనితో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. అన్ని అనుకున్నట్టు జరిగింటే మరికొద్ది రోజుల్లో తమ ఇంటికి కోడలు రాబోతుందని ఆశపడిన అత్త మామలు కూడా ఆ యువతి శవాన్ని చూసి తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
తన అందమైన భవిష్యత్‌పై కళలుకంటూ మరో మూడు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి డెంగీ భారిన పడింది. అనంతరం చికిత్సపోందుతూ అర్థంతరంగా తనువు చాలించింది. దీనితో పెళ్లి భాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగనున్నాయి. పూర్తి వివరాలు చూస్తే .. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలోని నరసింహాపురం పంచాయతీ టీవీఎన్‌ఆర్‌పురంకి చెందిన కృష్ణం రాజు,రెడ్డమ్మల కుమార్తె చంద్రకళ కి ఇటీవల పెళ్లి కుదిరింది. అక్టోబర్ 30న పెళ్లి చేసేందుకు వధువు,వరుడు తరుపు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. బంధువులు, కుటుంబసభ్యులతో ఇళ్లు సందడిగా మారింది. అయితే ఇదే సందర్భంలో పెళ్లికూతురు చంద్రకళ అనారోగ్యానికి గురైంది.
చికిత్స కోసం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో ఆమేకు డెంగీకి సంబంధించిన లక్షణాలు బయటపడటంతో తమిళనాడులోని షోళింగర్ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే బంధువులందరూ రావడంతో ఆమెకి ఆసుపత్రిలోనే పెళ్లి చేయాలనీ అనుకున్నారు. కానీ , ఆరోగ్యం పూర్తిగా క్షిణించడంతో 30వ తేదిన జరగాల్సిన పెళ్లిని సైతం వాయిదా వేశారు. దీంతో గత నాలుగు రోజులుగా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న చంద్రకళ నేడు తుదిశ్వాస విడిచింది. దీనితో ఆ కుటుంబం మొత్తం విషాదంలో కూరుకుపోయింది. రెండు రోజుల క్రితం తెలంగాణలో డెంగీకి ఓ కుటుంబం మొత్తం బలైన సంఘటన అందరికి తెలిసిందే.