Begin typing your search above and press return to search.
బుల్లెట్ పై పెళ్లి కూతురు
By: Tupaki Desk | 24 Jan 2016 10:45 AM GMTపల్లకిలో రాణిలా వచ్చే పెళ్లి కూతురు ఏకంగా బుల్లెట్ పై పెళ్లి మండపానికి వస్తే ఎలా ఉంటుంది.. మహారాణిలా టుంది. ఆ స్టైలే వేరబ్బా. నిజంగా అలాంటి స్టైల్లోనే వచ్చిందో పెళ్లి కూతురు. పెళ్లి మండపానికి బుల్లెట్ పై మహారాణిలా వచ్చింద. ఇలాంటి సంఘటనే ఆహ్మదాబాద్ లో జరిగింది.. గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన ఆయేషా ఉపాధ్యాయకు శనివారం రాత్రి వివాహం జరిగింది.. ఆమె స్థానిక వర్శిటీలో ప్రొఫెసర్ గా కూడా పని చేస్తుంది.. ఆమెకు బైక్ నడపడం అంటే మహా మక్కువ. దీంతో పెళ్లికి గిఫ్ట్ గా ఆమె సోదరుడు బుల్లెట్ కొనిచ్చాడు.. ఇంకేంముంది.. అసలే బైకుల పిచ్చి.. ఆపై కొత్త బుల్లెట్ దొరికింది.. పైగా పెళ్లి.. ఆమె కాస్త డిఫరెంటుగా ఆలోచించింది. మళ్లీమళ్లీ ఇలాంటి ఛాన్సు దొరకదని ఏకంగా పెళ్లికూతురు దుస్తుల్లోనే మండపానికి చేరుకుంది. పల్లకి లో రావాల్సిన పెళ్లి కూతురు బైక్ పై రావడంతో అందరూ ఒకింత ఆశ్చర్యపోయినా, కలకాలం గుర్తుండిపోయేలా బుల్లెట్ పై వచ్చిన నవ వధువుని ఈ పెళ్లికి హాజరైన వారు అభినందించారు.