Begin typing your search above and press return to search.
హెలికాఫ్టర్ లో కోడల్ని తీసుకొచ్చారు.. ట్విస్టు ఏమంటే?
By: Tupaki Desk | 17 Dec 2021 4:26 AM GMTతెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించదు కానీ.. దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికి కుల వివక్ష ఊహించని స్థాయిలో ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో సామాజికంగా వెనుకబడిన కులాల వారు వైభవంగా పెళ్లి చేసుకుంటే ఓర్చుకోలేరు. మంచి మార్కులు తెచ్చుకున్నా.. ఉన్నత చదువులు చదువుతున్నా తట్టుకోలేని తత్త్వం కనిపిస్తుంది. తమ కంటే మెరుగైన పరిస్థితుల్లో ఉన్న వారిని మాటలతోనూ. చేతలతోనూ వేధింపులకు గురి చేయటం కనిపిస్తుంది.
ఇలాంటి తీరుకు అప్పుడప్పుడు చెక్ పెట్టే ఉదంతాలు చోటు చేసుకుంటాయి. తాజాగా చోటు చేసుకున్న ఉదంతం రోటీన్ కు కాస్త భిన్నమైనది. ఒక దళిత కుటుంబానికి చెందిన వారు.. తమ ఇంటికి వస్తున్న కొత్త కోడలిని తమ ఇంటికి తీసుకురావటం కోసం ఏకంగా హెలికాఫ్టర్ ను అద్దెకు తీసుకున్న ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ ఎపిసోడ్ లో సదరు కుటుంబం దళిత వర్గానికి చెందినది కావటం గమనార్హం. రాజస్థాన్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
దళిత యువకుడైన తరుణ్ కు దియా అనే అమ్మాయితో వివాహమైంది. పెళ్లి కొడుకుది రాజస్థాన్ కాగా.. పెళ్లి కుమార్తెది పాకిస్థాన్ సరిహద్దుల్లోని బార్మర్ సమీపంలోని పట్టణానికి చెందినది. పెళ్లి అనంతరం కొత్త జంట హెలికాఫ్టర్ లో తమ ఇంటికి చేరుకున్నారు. అత్తారింటికి అడుగు పెట్టే కొత్త కోడలి కోసం రోటీన్ కు భిన్నంగా హెలికాఫ్టర్ ను ఏర్పాటు చేశారు. అయితే.. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం హెలికాప్టర్ సేవల్ని అందించాల్సిన సంస్థ చివరి క్షణంలో హ్యాండ్ ఇవ్వటంతో మరో సంస్థకు చెందిన హెలికాఫ్టర్ కోసం రూ.లక్ష అదనంగా చెల్లించి మరీ తీసుకున్నారు.
దళిత కుటుంబానికి చెందిన కొత్త కోడలిని హెలికాఫ్టర్ లో తీసుకొచ్చిన వైనం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో సంచలనమైంది. అత్తాంటికి వచ్చేందుకు హెలికాఫ్టర్ లో వచ్చిన ఈ కొత్త కోడలిని చూసేందుకు గ్రామస్థులు పోటెత్తారు. వారిని నియంత్రించటం కష్టమైంది. చివరకు పోలీసుల సాయంతో వారిని నిలువరించారు. ఈ ఉదంతం స్థానికంగా పెను సంచలనంగా మారింది.