Begin typing your search above and press return to search.
యోగి రాజ్యంలో ఇదో శాంపిల్ ఆరాచకం
By: Tupaki Desk | 23 March 2018 4:58 AM GMTవినేందుకు విచిత్రంగా అనిపించినా కొన్ని ఘటనలు షాకింగ్ గా అనిపిస్తుంటాయి. అలాంటి ఉదంతమే ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. స్వచ్ఛమైన పాలనను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పే యూపీలో చోటు చేసుకున్న ఈ ఘటన వింటే సిగ్గుతో తలదించుకోవాల్సిందే. ఇప్పటివరకూ పశువుల వేలం పరిచయమే. అంతకంటే హీనాతిహీనంగా ఒక పెళ్లికుమార్తెను వేలం వేసిన వైనం సంచలనంగా మారింది.
యూపీలోని సూరూర్ పూర్ గ్రామానికి చెందిన ఒక యువతి ఇటుకబట్టీలో పని చే్స్తోంది. అదే బట్టీలో పని చేసే కార్మికుడు ఆమెను పెళ్లాడాలనుకున్నాడు. అయితే.. అందుకు ఆ యజమాని ఒక షరతుపెట్టాడు. పెళ్లికుమార్తెను వేలం వేస్తామని.. అందులో గెలుచుకొని పెళ్లి చేసుకోవాలన్నాడు. దీనికి ఆ యువకుడు సరేననటంతో యువతిని వేలం వేశారు.
వేలంపాటలో యువతిని రూ.22వేలకు సదరు యువకుడు గెలుచుకున్నాడు. రూ.17వేలు ముందస్తుగా చెల్లించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మిగిలిన రూ.5వేలు పెళ్లి తర్వాత ఇస్తామని చెప్పాడు. అయితే.. పెళ్లి తర్వాత వేలం డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఇటుకబట్టీ యజమానులు ముకేశ్.. మోనులు పెళ్లి కుమార్తెను ఎత్తుకెళ్లిపోయారు. దీంతో మానసికంగా తీవ్ర ఆవేదనకు గురైన సదరు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వైనంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.