Begin typing your search above and press return to search.
గుర్రం మీద ముస్లిం వధువు.. ఇప్పుడిది వైరల్
By: Tupaki Desk | 6 Dec 2017 5:41 AM GMTమనిషిని కుక్క కరవటం ఎంతమాత్రం వార్త కాదు. కానీ.. అదే కుక్కని మనిషి కరవటం వార్త అవుతుంది. గుర్రం మీద ఒక యువతి ఊరేగితే వార్తేమిటన్న డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే.. కొన్ని అంశాల్లో ఎక్కువ పరిమితులున్న చోట.. అందుకు భిన్నంగా వ్యవహరించటం సంచలనమే. అలాంటి ఉదంతమే తాజాగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చోటు చేసుకుంది. ఒక ముస్లిం యువతి చేసిన పని ఇప్పుడు అందరి నోటా నానుతోంది.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఒక యువతికి పెళ్లి కుదిరింది. రోటీన్‌కు భిన్నంగా తన పెళ్లి జరగాలని ఆ యువతి ఫీలైంది. ఇంట్లో వాళ్లను ఒప్పించటమే కాదు.. పెళ్లి కొడుకు వాళ్లను కన్వీన్స్ చేసింది. అంతే.. ఇప్పుడామె పెళ్లి వేడుక హాట్ టాపిక్ గా మారింది.
ముస్లిం పెళ్లిళ్లలో పెళ్లికొడుకు గుర్రం మీద పెళ్లి వేదిక వద్దకు రావటం కామన్. కానీ.. అందుకు భిన్నంగా పెళ్లి కుమార్తె నేహా గుర్రం మీద ఊరేగింపుగా రావటంతో అందరూ ముక్కున వేలేసుకునే పరిస్థితి. నవ వధువు గుర్రం మీద ఊరేగుతూ రావటం ఒక ఎత్తు అయితే.. ఆమె బంధువులు ఆమెను అనుసరిస్తూ పూలతో అలంకరించిన కారులో ఆమెను ఫాలో అయ్యారు.
ఈ పెళ్లిలో మరో విశేషం ఏమిటంటే.. పెళ్లి కుమార్తెను ఫాలో అయ్యే వచ్చే వారిలో మరికొందరు ఒంటెల మీద ఊరేగుతూ పెళ్లి మండపం వద్దకు చేరుకోవటం స్థానికుల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ఇప్పుడీ పెళ్లి వేదిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.