Begin typing your search above and press return to search.

వీడియో వైరల్ :తుఫాన్ కు కూలిన వంతెన

By:  Tupaki Desk   |   2 Oct 2019 12:12 PM GMT
వీడియో వైరల్ :తుఫాన్ కు కూలిన వంతెన
X
దాదాపు 140 మీటర్ల తీగల వంతెన.. తుఫాన్ తాకిడికి మధ్యలో విరిగిపోయింది. చండ ప్రచండ తుఫాన్ దెబ్బకు వంతెన నదిలో పేకమేడలో కుప్పకూలింది. తైవాన్ లోని నాన్ఫాంగోలో జరిగిన ఈ ఘటన వీడియో వైరల్ గా మారింది.

నాన్ఫాంగోలోని నదిపై వేలాడే తీగల వంతెన భారీ తుఫాన్ కు నిలువలేకపోయింది. బ్రిడ్జిపైనుంచి ఆయిల్ ట్యాంకర్ వెళ్తున్న సమయంలో బ్రిడ్జి మధ్యలో విరిగి ఆ ఆయిల్ ట్యాంకర్ కిందనున్న ఫిషింగ్ బోటుపై పడింది. దీంతో మంటలు చెలరేగాయి. తుఫాన్ తీరం దాటి వంతెన మీదుగా ప్రయాణిస్తున్న వేళ భారీ గాలులకు బలహీనపడి క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో వంతెనపై ప్రయాణిస్తున్న వాహనాలు నదిలో పడ్డాయి. ఈ ప్రమాదంలో 14మంది గాయపడగా.. కిందపడిన వాహనాల్లోని ప్రయాణికులు నీటిలో మునిగి గల్లంతయ్యారు. ఎంత మంది మరణించారనే విషయంలో స్పష్టత లేదు..

ఈ వంతెన కింద న ఫిషింగ్ బోటులు ఉండడంతో పెను ప్రమాదమే జరిగి ఉంటుందని.. చాలా మంది నదిలో మునిగి గల్లంతయ్యింటారని భావిస్తున్నారు. నదిలో గాలింపు చర్యలు కూడా చేపట్టారు. శిథిలాల కింద కొంత మంది చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు.

1998లో ప్రారంభించిన ఈ బ్రిడ్జి ఒకే ఆర్క్ తో కూడిన ప్రపంచంలోనే అరుదైన రెండో వంతెన. 460 అడుగుల పొడవు, 60 అడుగుల ఎత్తున ఈ బ్రిడ్జిని నిర్మించారు. తుఫాన్ తీరం దాటిన సమయంలో బలమైన గాలులకు బ్రిడ్జి బలహీన పడి.. భారీ వాహనాలు వంతెనపై ప్రయాణించడంతోనే కూలిపోయిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.