Begin typing your search above and press return to search.
సరిహద్దులో కూలిన వంతెన: ప్రజల రాకపోకలకు ఆటంకం
By: Tupaki Desk | 23 Jun 2020 9:30 AM GMTఅకస్మాత్తుగా భారత్- చైనా సరిహద్దులో ఉన్న ఓ వంతెన కుప్పకూలిపోయింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోర్గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ వాహనం భారీ నిర్మాణ యంత్రాన్ని బ్రిడ్జ్ పైనుంచి తీసుకెళ్తుండగా ఒక్కసారిగా వంతెన కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. లిలాం జోహార్ లోయలోని మున్సారీ తహసీల్ వద్ద ఉన్న ధపా మిలాం రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
మిలాం నుంచి చైనా సరిహద్దు వరకు 65 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల కోసం భారీ యంత్రాన్ని అక్కడకు తీసుకెళ్తున్నారు. ఈ వంతెన కూలిపోవడంతో స్థానిక ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సరిహద్దు ప్రాంత గ్రామాల్లోని 7,000 మందికిపైగా ప్రజలు రాకపోకలు సాగించలేని పరిస్థితి.
ఈ వంతెన కూలడంతో భారత సైన్యానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు వచ్చి పడ్డాయి. ఆర్మీ, ఐటీబీపీ దళాల ప్రయాణాలకూ విఘాతం కలిగింది.
ప్రస్తుతం చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం పెరుగుతోంది. ఈ సమయంలో వంతెన కూలడంతో భారత్ సైనిక కార్యకలాపాలు నిర్వహించడం కష్టంగా మారింది. స్పందించిన ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.