Begin typing your search above and press return to search.
ప్రజలు కోపగిస్తే కేసీఆర్‌ను దేవుడు కాపాడలేడట
By: Tupaki Desk | 9 March 2017 5:57 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఇటీవల తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న కమ్యూనిస్టు నేతలు ఆయన చర్యలను నిశితంగా విమర్శిస్తున్నారు. కేసీఆర్ ఇటీవల తిరుమల వెళ్లి వెంకటేశ్వరుడికి ఆభరణాలు సమర్పించిన వైనంపై వామపక్షాల నేతలు ఆగ్రహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సీపీఎం జాతీయ నాయకురాలు బృందాకారత్ సైతం ఈ పరిణామంపై ఘాటుగా స్పందించారు. సీపీఎం తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సామాజిక తెలంగాణ పాదయాత్రకు హాజరైన బృందా కారత్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు కోపం వస్తే కేసీఆర్‌ను ఏ దేవుడు కాపాడలేడని హెచ్చరించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సంక్షేమాన్ని విస్మరించి గుళ్లు, గోపురాలు తిరుగుతున్నారని బృందా కారత్ విమర్శించారు. దేవుళ్ల మొక్కులు గుర్తు పెట్టుకొని మరీ పూర్తి చేసిన కేసీఆర్‌కు ప్రజల మొర ఎందుకు చెవికి ఎక్కడం లేదని ప్రశ్నించారు. సామాజిక తెలంగాణ కోసం ఎర్రజెండా ముందు నడుస్తుందని, అయితే ఈ పరిణామాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారని ఆరోపించారు. కానీ తాము ప్రజల పక్షాన వినిపించిన డిమాండ్లను సొంత ఖాతాలో జమ చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఎంబీసీల గురించి సీపీఎం ప్రస్తావిస్తే కేసీఆర్ కమిషన్ ప్రకటించారని ఇలాగైనా తమ డిమాండ్‌ను నెరవేర్చినందుకు సంతోషమని బృందా కారత్ వ్యాఖ్యానించారు.
యూపీ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మతతత్వ ఎజెండా అమలుచేశారని బృందా కారత్ విమర్శించారు. ప్రధానమంత్రిలాగా కాకుండా ఆర్ఎస్ఎస్ ప్రచారక్ వలే మోడీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్లకు దోచిపెడుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని బృందాకరత్ ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి అంబానీలు, అదానీల సమస్యలు తప్ప ఆమ్ ఆద్మీల సమస్యలు పట్టవని వ్యాఖ్యానించారు.