Begin typing your search above and press return to search.
‘భజ్జీ’ చెన్నైకి బరువైనా.. కోల్‌కతా కోరి తెచ్చుకుంది..!
By: Tupaki Desk | 20 Feb 2021 8:30 AM GMTతన బౌలింగ్‌లో బ్యాట్స్మెన్లను తికమక పెట్టే హర్బజన్‌సింగ్.. అప్పుడప్పుడు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుతుంటాడు.. కీలక సమయంలో పరుగులు కూడా అందిస్తాడు. అయితే 2019 ఐపీఎల్ ఫైనల్లో ఆడిన భజ్జీ ఆ తర్వాత పెద్దగా మ్యాచ్‌లు ఆడలేదు. గత ఏడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్లో అతడు లేడు. దీంతో చెన్నై సూపర్‌కింగ్స్ భజ్జీని వదులుకున్నది.
అయితే ఈ సారి మాత్రం రూ. 2 కోట్లకు కేకేఆర్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) హర్బజన్‌ను తీసుకున్నది.
గత మూడేళ్లుగా హర్బజన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్నాడు. ఈ సారి హర్బజన్‌ను చెన్నై వదులుకున్నది. దీంతో కేకేఆర్ అతడిని తీసుకున్నది. దీంతో హర్బజన్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. కేకేఆర్ మరోసారి ట్రోఫీ గెలవాలని ఉందని అతడు ట్వీట్ చేశాడు.
తాను 100 శాతం జట్టు విజయంకోసం ఆడతానని అతడు చెప్పాడు. భజ్జీ ట్వీట్‌పై కేకేఆర్కూడా స్పందించింది. భజ్జీ రాకను తాము స్వాగతిస్తున్నామని చెప్పింది. జట్టుకు విజయాలు తీసుకొచ్చే ఆటగాడు వచ్చాడని తెలిపింది.
హర్బజన్ 160 మ్యాచ్‌లు ఆడి 150 వికెట్లు తీశాడు. మరోవైపు 2018 నుంచీ చెన్నై తరఫున ఆడుతున్న అతడు 2019 సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు.