Begin typing your search above and press return to search.

గంభీర్ కోసం అమ్మాయిలు అలా చేశారు

By:  Tupaki Desk   |   12 Sep 2016 4:39 AM GMT
గంభీర్ కోసం అమ్మాయిలు అలా చేశారు
X
అభిమానం ఏమైనా చేసేలా చేస్తుంది. టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ కోసం నలుగురు అమ్మాయిలు చేసిన పని ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది తన పేలవ ప్రదర్శనతో టీమిండియాలో స్థానం కోల్పోయిన గంభీర్ ఇప్పుడు తన ఆటతో మళ్లీ జాతీయజట్టులో స్థానం కోసం విపరీతంగా శ్రమిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో తన ఆటతో సెలెక్టర్ల మనసు దోచుకునేందుకు తెగ ట్రై చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గంభీర్ కోసం దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా నలుగురు అమ్మాయిలు చేసిన పని ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది.

నొయిడాలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ నుచూసేందుకు స్టేడియంకు వచ్చిన ఈ నలుగురు అమ్మాయిలు.. 20 అడుగుల పెద్ద బ్యానర్ ను తీసుకొచ్చి ఎర్రటి ఎండలో అందరికి కనిపించేలా తమ బ్యానర్ ను ప్రదర్శించారు. ఈ బ్యానర్ సారాంశం ఏమిటంటే.. గంభీర్ ను మళ్లీ జాతీయ జట్టులోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. తమ అభిమాన క్రికెటర్ కోసం నలుగురు అమ్మాయిలు పడిన శ్రమ కొంతమేర ఫలించిందని చెబుతున్నారు. స్టేడియంలో ఆటను చూస్తున్న సెలెక్టర్లు.. ఈ బ్యానర్ ను చూడటం.. దాని గురించి ఆరా తీయటం కనిపించింది.

నిబంధనల ప్రకారం తన అభిమానుల్ని కలిసే అవకాశం లేకపోవటంతో..సిబ్బందికి చెప్పి.. వారికి మంచినీళ్లు అందేలా చూశారు గంభీర్. తన కోసం ఎర్రటి ఎండలో నిలబడి బ్యానర్ పట్టుకున్న కష్టాన్ని ఎంతోకొంత తగ్గించేందుకు ట్రై చేశారు గంభీర్. ఏమైనా ఒక క్రికెటర్ కోసం నలుగురు అమ్మాయిలు పడిన కష్టం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. మరి.. బ్యానర్ తోనే టీమిండియాలో ఆడే ఛాన్స్ దక్కుతుందా? అన్నది ఒక ప్రశ్న. తన ఆటతో గంభీర్ జాతీయ జట్టులో స్థానం దక్కించుకొని తనను అభిమానించే వారి మనసుల్ని దోచుకోవాలని ఆశిద్దాం.