Begin typing your search above and press return to search.

నా వ‌ల్ల‌కాదు.. ఆ మాట వెన‌క్కి తీసుకుంటున్నాః ఎల‌న్ మ‌స్క్

By:  Tupaki Desk   |   6 July 2021 10:33 AM GMT
నా వ‌ల్ల‌కాదు.. ఆ మాట వెన‌క్కి తీసుకుంటున్నాః ఎల‌న్ మ‌స్క్
X
ఎల‌క్ట్రిక్ కార్ల దిగ్గ‌జం 'టెస్లా' అధినేత‌ ఎల‌న్ మ‌స్క్ కెపాసిటీ ఏంట‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. ప్రస్తుత లెక్కల ప్రకారం ప్రపంచంలోనే అతను మూడో అత్యధిక ధనవంతుడు. వ్య‌క్తిగత జీవ‌న విధానంతో వార్త‌ల్లో నిలిన మ‌స్క్‌.. ప్రొఫెష‌న‌ల్ గానూ ఎవ్వ‌రికీ సాధ్యం కాని ఫీట్ సాధిస్తాన‌ని ఆ మ‌ధ్య ప్ర‌క‌టించారు. అదే సెల్ఫ్ డ్రై కార్ల త‌యారీ. డ్రైవ‌ర్ లేకుండానే నేవిగేష‌న్ స‌హాయంతో సాగిపోయే కారును టెస్లా త‌యారు చేస్తుంద‌ని, అది కూడా 2021లోనే రోడ్ల‌పైకి వ‌చ్చేస్తుంద‌ని చెప్పారు.

దీంతో.. ప్ర‌పంచం మొత్తం ఆస‌క్తిగా ఎదురు చూసింది. 'ఎస్ ప్లెయిడ్‌' మోడల్ కారును డ్రైవర్ లెస్ గా తీసుకురానున్నట్టు చెప్పడంతో.. దాని తీరుతెన్నులు తెలుసుకునేందుకు అందరూ వెయిట్ చేశారు. అయితే.. ఈ మోడ‌ల్ జూన్లో విడులైంది. దీంతో.. ఈ కారులో సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ కూడా ఉంటుంద‌ని అనుకున్నారు. కానీ.. ఆ ఫీచ‌ర్ లేకుండానే ఎస్ ప్లెయిడ్ కారు లాంఛ్ అయ్యింది.

దీనిపై లేలెస్ట్ గా స్పందించిన ఎల‌న్ మ‌స్క్‌.. ఎవ్వ‌రూ ఊహించ‌ని వ్యాఖ్య‌లు చేశారు. డ్రైవ‌ర్ లేని కారును మార్కెట్ లోకి తేవ‌డం ఇప్ప‌ట్లో వీల‌య్యే ప‌నికాద‌ని చెప్పేశారు. ''సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ ఎంతో జ‌ఠిల‌మైన‌ది. దీన్ని నిజం చేయాలంటే.. వాస్త‌విక ప్ర‌పంచానికి త‌గిన విధంగా ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్ ను త‌యారు చేయాలి.'' అని అన్నారు మస్క్.

అంతేకాదు.. ఇది చాలా కష్టమని కూడా చెప్పారు. ''ఇది చాలా క‌ష్టంతో కూడుకున్న ప‌ని. ఈ విష‌యాన్ని నేను గ‌తంలో ఊహించ‌లేదు. వాస్త‌విక‌త‌కు ఉన్నంత స్వేచ్ఛ దేనికీ లేదు'' అని తేల్చేశారు టెస్లా అధినేత ఎల‌న్ మ‌స్క్‌. ఇక‌, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ప్ర‌యోగాలు ప్ర‌స్తుతం ఏ ద‌శ‌లో ఉన్నాయ‌నే అంశాన్ని టెస్లా కంపెనీ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం లెవ‌ల్ 2 ద‌శ‌లో ప్ర‌యోగాలు ఉన్న‌ట్టు తెలిపింది.

ఇదిలాఉంట‌.. వ్య‌క్తిగ‌త జీవితంలో తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తోనూ ఎల‌న్ మ‌స్క్ ప్ర‌పంచాన్ని ఆశ్చ‌ర్య ప‌రుస్తున్నారు. దాదాపుగా ఈ భూమ్మీదున్న ధ‌న‌వంతులంతా ఒకే ల‌క్ష్యంతో ప‌ని చేస్తుంటాడు. త‌మ‌కున్న ఆస్తుల‌ను ఎంత పెరిగితే.. అంత‌గా పెంచుకుంటూ పోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటారు. కానీ.. మ‌స్క్ మాత్రం వారికి భిన్నంగా.. త‌న‌కున్న ఆస్తుల‌ను అమ్మేసుకుంటూ వెళ్తున్నారు!

కొంత కాలంగా త‌న‌కు ఉన్న ఇళ్ల‌ను అమ్మేస్తూ వ‌స్తున్న మ‌స్క్ కు.. ప్ర‌స్తుతం ఒకే ఒక సొంత ఇల్లు ఉంది. ఇప్పుడు దాన్ని కూడా అమ్మేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అమెరికాలోని కాలిఫోర్నియా బే ఏరియాలో ఆ ఇల్లు ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ ఇంటిని ప్రైవేటు కార్య‌క్ర‌మాల‌కు అద్దెకు ఇస్తూ వ‌స్తున్నారు. ఇప్పుడు.. ఉన్న ఈ ఒక్క ఇంటిని కూడా అమ్మేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఇదంతా ఎందుకు చేస్తున్నాడో కూడా వెల్ల‌డించారు మ‌స్క్. త‌న జీవన విధానాన్ని ప‌ర్యావ‌ర‌ణ హితంగా మ‌లుచుకునే కార్య‌క్ర‌మంలో భాగంగానే ఇలా చేస్తున్న‌ట్టు చెప్పారు. త‌న అవ‌స‌రాల‌ను సాధ్య‌మైనంత మేర త‌గ్గించుకుంటున్న‌ట్టు వెల్ల‌డించారు. త‌న జీవితాన్ని ప‌ర్యావ‌ర‌ణం కోసం, ఇత‌ర గ్ర‌హాల్లో మనుషులు కాలు పెట్టేందుకు చేసే ప‌నుల కోసం అంకితం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

ఎల‌క్ట్రిక్ కార్ల రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు శ్రీకారం చుట్టిన మ‌స్క్‌.. ఆ విధంగా కూడా కాలుష్య నివార‌ణ‌కు, త‌ద్వారా ప‌ర్యావ‌ర‌ణ హితానికి కృషి చేస్తున్నారు. అదే స‌మ‌యంలో అంత‌రిక్ష ప్ర‌యోగాలు కూడా చేప‌డుతున్నారు. ఇప్పుడు త‌న అవ‌స‌రాల‌ను త‌గ్గించుకుంటూ.. ఆస్తుల‌ను విక్ర‌యిస్తుండ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశమైంది.