Begin typing your search above and press return to search.
ప్రపంచకప్ ఫైనల్ పై ప్రధానమంత్రుల స్పందన!
By: Tupaki Desk | 16 July 2019 5:30 PM GMTఒకవైపు థెరిస్సా మే, మరోవైపు జెసిండా అర్డెర్న్.. ఒకరు బ్రిటన్ ప్రధాని, మరొకరు న్యూజిలాండ్ ప్రధాని. ఈ మహిళలు ఇద్దరూ ప్రపంచకప్ ఫైనల్ మీద, సూపర్ ఓవర్ మీద స్పందించారు. ఇద్దరూ ఒకే రకమైన స్పందన వ్యక్తం చేయడం గమనార్హం.
వీరిద్దరూ తమ తమ జట్టును అభినందించారు. తమ జట్టు ప్రదర్శనను చూసి దేశం గర్విస్తోందని ఇరు ప్రధానులూ ప్రకటించడం విశేషం. తమ స్థాయి మెరుగుపడిందని ఈ ఇద్దరు మహిళా ప్రధానులూ స్పందించారు. ఇంగ్లండ్ జట్టు ప్రపంచకప్ విజయం గర్వకారణమని థెరిస్సా మే అన్నారు.
తనను కలిసి ఇంగ్లిష్ జట్టు ఆటగాళ్లకు ఆమె విందు ఇచ్చారు. వారి ప్రదర్శన దేశంలో యువతకు, పిల్లలకు ప్రేరణ అని మే అభిప్రాయపడ్డారు. ఇంగ్లండ్ జట్టు ప్రపంచకప్ గెలవడంతో దేశంలో మరింత మంది పిల్లలు భావి క్రికెటర్లుగా తయారయ్యే అవకాశం ఉందని అన్నారు.
ఇక న్యూజిలాండ్ ప్రధాని కూడా తమ జట్లును ప్రశంసించారు. మ్యాచ్ టై అయిన నేపథ్యంలో, ఇంగ్లండ్ కేవలం సాంకేతికమైన రీతిలో విజయం సాధించిన నేపథ్యంలో.. న్యూజిలాండ్ ప్రదర్శన తమకు గర్వకారణం అని ఆర్డెర్న్ అన్నారు. న్యూజిలాండ్ జట్టను తను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టుగా ఆమె పేర్కొన్నారు. ఇలా ఇరు దేశాల ప్రధానమంత్రులూ.. గెలిచిన, ఓడిన తమ జట్ల విషయంలో ఒకే రీతిలో స్పందించారు.