Begin typing your search above and press return to search.
ఆస్ట్రాజెనికా అత్యవసర వినియోగానికి బ్రిటన్ అనుమతి..
By: Tupaki Desk | 4 Jan 2021 12:53 PM GMTఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌కు బ్రిటన్‌లో అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది. కరోనా మహమ్మారి బ్రిటన్ను ముప్పు తిప్పలు పెట్టింది. ఇప్పటికే అక్కడ ఫైజర్ వ్యాక్సిన్‌కు అనుమతి లభించింది. ఫైజర్ పంపిణీ కూడా ప్రారంభమయింది. అయితే బ్రిటన్‌లో ఇటీవల కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాపించింది. ఇది పాత కరోనా కంటే వేగంగా విస్తరిస్తున్నది. దీంతో అన్నిదేశాల్లో ఈ కొత్త స్ట్రెయిన్‌పై ఆందోళన నెలకొన్నది. ఈ నేపథ్యంలో పలు దేశాలు బ్రిటన్‌తో రాకపోకలు కూడా నిలిపివేశాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో బ్రిటన్‌లో ఆక్స్ఫర్డ్ తీసుకొచ్చిన ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌కు అనుమతి లభించింది.
బ్రిటన్‌కు చెందిన 82 ఏళ్ల డయాలసిస్ పేషెంట్ బ్రియాన్ పింకర్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని వైద్యసిబ్బంది పింకర్ టీకా వేశారు. ఈ సందర్భంగా పింకర్ మాట్లాడుతూ.. తొలిటీకాను తీసుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని చెప్పారు. కరోనా కోసం ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌ను తీసుకోవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఆక్స్ఫర్డ్ హాస్పిటల్లో చీఫ్ నర్సింగ్ ఆఫీసర్‌గా చేస్తున్న సామ్ ఫోస్టర్ ఆ వృద్ధుడికి టీకా వేశారు. టీకాను అభివృద్ధి చేసిన ప్రాంతానికి కొన్ని వందల మీటర్ల దూరంలోనే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఇవ్వడం ప్రత్యేకంగా భావిస్తున్నట్లు సామ్ ఫోస్టర్ తెలిపారు.
ఆక్స్ఫర్డ్ టీకాకు డిసెంబర్ 30న బ్రిటన్ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం అక్కడ వ్యాక్సినేషన్ మొదలుపెట్టారు. మరోవైపు మనదేశంలో కూడా ఆక్స్ఫర్డ్ టీకాకు అనుమతి లభించింది. ఆక్స్ఫర్డ్ టీకాతోపాటు భారత్‌బయోటెక్ తయారు చేసిన కోవాక్జిన్కు కూడా అనుమతి వచ్చింది. ఇప్పటికే డ్రైరన్ ప్రారంభించారు. త్వరలోనే వ్యాక్సినేషన్ ప్రారంభించే అవకాశం ఉన్నది.