Begin typing your search above and press return to search.

కరోనాను అంతం చేసే టాబ్లెట్ కనిపెట్టిన బ్రిటన్

By:  Tupaki Desk   |   5 Nov 2021 7:31 AM GMT
కరోనాను అంతం చేసే టాబ్లెట్ కనిపెట్టిన బ్రిటన్
X
చైనాలోని వూహాన్ లో పుట్టి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన వైరస్ ‘కరోనా’. ఇప్పటికీ దీని తీవ్రత తగ్గడం లేదు. భారత్ లో భారీ వ్యాక్సినేషన్ కారణంగా ప్రస్తుతం కంట్రోల్ లోకి వచ్చింది. అయితే రష్యా, యూరప్, అమెరికాల్లో మళ్లీ భారీ కేసులు నమోదు కావడం భయాందోళనలను రేకెత్తిస్తోంది. ఇప్పటిదాకా కరోనా కు మందు లేదు. కనిపెట్టలేదు. ప్రస్తుతం టీకా ఒక్కటే ముందస్తు ప్రాణాపాయం తప్పేలా వేసుకుంటే సరిపోతుంది.

కరోనాపై పోరులో తాజాగా బ్రిటన్ దేశం అద్భుత ప్రగతి సాధించింది. కరోనాకు చెక్ పెట్టే మాత్రను కనిపెట్టింది. త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. అమెరికా సంస్థ మెర్క్, రిడ్జ్ బ్యాక్ బయోథెరప్టిక్స్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ఈ టాబ్లెట్ వినియోగానికి అనుమతిస్తున్నట్టు బ్రిటన్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.

మోల్నుపిరావిర్ పేరుతో తయారైన ఈ మాత్రను కరోనా పాజిటివ్ గా తేలిన ఐదురోజుల్లోపు వేసుకోవడం మొదలుపెట్టాలని బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ (ఎంహెచ్ఆర్ఏ) సూచించింది. కరోనాకు ఈ నూతన చికిత్స విధానాన్ని ఆమోదించిన తొలి దేశంగా బ్రిటన్ చరిత్ర సృష్టించింది.

ఈ టాబ్లెట్ పై అమెరికాలో సమీక్షలు జరుగుతున్న సమయంలోనే బ్రిటన్ దూకుడుగా ముందుకెళ్లి కావాల్సిన అనుమతులు జారీ చేసేసింది.

ఇక ఈనెలలో జరుగబోయే సమావేశంలో అమెరికా కూడా మోల్నుపిరావిర్ పై ఓటింగ్ చేపట్టనుంది. దాన్ని ఆమోదించేందుకు రెడీ అయ్యింది.

ఇక ఇప్పటివరకూ కరోనాకు మందు లేదు. యాంటీ వైరల్ డ్రగ్స్ రెమెడిసివిర్, డెక్సామెథాజోన్ వంటివి అందుబాటులో ఉన్నప్పటికీ వీటిని వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత మోల్నుపిరావిర్ ను మాత్రం రోగులు ఇంటివద్ద ఉంటూనే తీసుకోవచ్చు. దీంతో వ్యాధి ముదిరి ఆస్పత్రిపాలయ్యే ప్రమాదం దాదాపు 50శాతానికి పైగా తగ్గిపోతుంది.

బ్రిటన్ లో ప్రస్తుతం కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ మాత్రకు ఆమోదం లభించడం అక్కడి ప్రజలకు స్వాంతన కలిగించే విషయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.