Begin typing your search above and press return to search.
ఆ బ్రిటన్ ఎంపీని లాగి పెట్టి పీకాలనిపించటం ఖాయం
By: Tupaki Desk | 28 Aug 2019 6:03 AM GMTప్రధాని మోడీపై పాకిస్థాన్ మూలాలు ఉన్న ఒక బ్రిటన్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగానే కాదు.. లాగి పెట్టి రెండు పీకాలన్నభావనను ప్రతి భారతీయుడికి కలిగేలా అతడి మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు. ఒక ఎంపీ స్థాయి వ్యక్తి నోటి నుంచి ఏ తరహా వ్యాఖ్యలు రాకూడదో.. అలాంటి మాటల్ని మాట్లాడిన అతగాడి మాటలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బీజేపీ సీనియర్ నేతలపై విపక్షాలు చేతబడి చేస్తుందని.. అందుకే ముఖ్యనేతలంతా చనిపోతున్నట్లుగా బీజేపీ ఎంపీ చేసిన సంచలన వ్యాఖ్యల అలజడి ఇంకా కొలిక్కి రాకముందే.. దారుణమైన వ్యాఖ్యల్ని చేశారు బ్రిటన్ ఎంపీ నజీర్ అహ్మద్. తర్వాత మోడీనే అంటూ అతగాడు నోరు పారేసుకున్న తీరుపై పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఇతగాడు పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారటమే కాదు.. వివాదాస్పదంగా మారింది. ఈ బ్రిటన్ ఎంపీని నెటిజన్లు తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు. అసలు ఇలాంటి నేతను ప్రజలు ఎలా ఎన్నుకున్నారు? ఇలాంటి దారుణమైన మైండ్ సెట్ ఉన్న వారిని చట్టసభకు ఎలా ఎంపిక చేస్తారన్న ప్రశ్నను పలువురు నెటిజన్లు సంధిస్తున్నారు. అతడి ట్వీట్ పై దుమ్మెత్తి పోస్తున్ నెటిజన్లు.. అతడ్ని భారీగా ట్రోల్ చేస్తున్నారు.
బీజేపీపై ప్రతిపక్ష పార్టీ ఏదో జాదూ చేస్తోంది. చేతబడులు - వశీకరణ ప్రదర్శిస్తోంది. అందుకే అటల్ బిహారీ వాజ్ పేయి - మనోహర్ పారికర్ - సుష్మా స్వరాజ్ - అరుణ్ జైట్లీ వంటి బీజేపీ నేతలు ఏడాది వ్యవధిలోనే మరణించారు. తర్వాతి నెంబర్ నరేంద్ర మోదీదే అంటూ నజీర్ అహ్మద్ నోరు పారేసుకున్నారు. ఆయన వ్యాఖ్యపై పెద్ద ఎత్తున అలజడి చోటు చేసుకోవటమే కాదు..ఇలాంటి వారిని బ్రిటన్ ఎంపీ పదవికి అక్కడి ప్రజలు ఎలా ఎన్నుకున్నారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. సోషల్ మీడియాలో అతడిపై వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాల భారీగా ఉన్నాయని చెప్పక తప్పదు.