Begin typing your search above and press return to search.
నాన్ వెజ్ లవ్వర్స్ కు చేదువార్త
By: Tupaki Desk | 14 Aug 2017 4:28 AM GMTముద్ద ముద్దకూ ముక్క ఉండాలన్నట్లుగా ఉండేవారు చాలామంది ఉంటారు. అలాంటి అవకాశం తమకు ఎప్పుడు వస్తుందో అని ఆశగా ఎదురుచూసే వారు కోట్లల్లోనే ఉంటారు. అయితే.. ఇంత భయంకరమైన నాన్ వెజ్ లవ్వర్స్ సైతం రానున్న రోజుల్లో వెజిటేరియన్స్ గా మారిపోవటం ఖాయమన్న మాట ఇప్పుడు విస్తృతంగా వినిపిస్తోంది. వెజ్ ను పగోడ్ని చూసినట్లు చూసే నాన్ వెజ్ ప్రియులు ఫ్యూచర్లో మాత్రం వెజ్ కు షిఫ్ట్ కావటం ఖాయమన్నట్లుగా చెబుతున్నారు.
ఏది ఏమైనా.. అలా జరగటం మాత్రం సాధ్యం కాదంటూ ధీమాను వ్యక్తం చేస్తుంటారు పలువురు నాన్ వెజ్ ప్రియులు. అయితే.. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదని.. కావాలంటే బలమైన ఉదాహరణను చూపిస్తామని చెబుతున్నారు పలువురు పరిశోధనకారులు. వెస్ట్రన్ దేశాల్లో నాన్ వెజ్ చాలా కామన్. అలాంటి వారే ఇప్పుడు వెజ్ లోకి మారిపోతున్న సరికొత్త విషయాన్ని బయట పెట్టే అధ్యయనం ఒకటి బయటకు వచ్చింది.
నాన్ వెజ్ ను విపరీతంగా వాడే బ్రిటన్ పౌరులు శాఖాహారానికి షిఫ్ట్ అవుతున్న ఆసక్తికర విషయం తాజాగా బయటకు వచ్చింది. గడిచిన ఆరు నెలల వ్యవధిలో ఆ దేశ జనాభాలో 28 శాతం మంది మాంసాహారాన్ని మానేశారన్న షాకింగ్ నిజం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రానున్న కొద్ది రోజుల్లో మరో 14 శాతం మంది శాఖాహారులుగా మారే చాన్స్ ఉందన్న వాదనా వినిపిస్తోంది.
ముక్కను ఎలాంటి మొహమాటం లేకుండా తినేసే వారిలో అంత మార్పు ఎలా వచ్చింది? అదెలా సాధ్యమైందన్న ప్రశ్నలకు సమాధానాలు వస్తున్నాయి. మూగజీవాల్ని ఆహారం కోసం చంపేటప్పుడు వాటి రోదనను గమనించిన పలువురు జీవహింస అనైతికమని.. మాంసాహారాన్ని మానేయాలని నిర్ణయించుకొని నాన్ వెజ్ తినటం మానేశారట. ఇక.. మూగజీవాల్ని ఆహారం కోసం హింసించవద్దంటూ బ్రిటన్ లో సినిమా రావటం కూడా అక్కడి ప్రజల మీద ప్రభావాన్ని చూపిస్తోందని చెబుతున్నారు. ఈ కారణాలతో పాటు.. నాన్ వెజ్ కారణంగా గుండె జబ్బులతో పాటు మరెన్నో వ్యాధులకు అవకాశం ఉందన్న వాదన ఇప్పుడు విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది.
అభివృద్ధి చెందిన దేశాల్లో స్థూలకాయం కూడా ఆందోళనకరమైన అంశంగా మారింది. దీనికి నాన్ వెజ్ కారణమని భావించటంతో పాటు.. బరువు తగ్గేందుకు మొదటగా చేయాల్సిన పనుల్లో మాంసాహారాన్ని మానేయటం .. శాఖాహారాన్ని తీసుకోవటం అన్నది ఈ మధ్యన ఎక్కువైందని చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. వివిధ మీడియా వేదికల మీద తమ అభిప్రాయాల్ని వినిపిస్తున్న నిపుణులు సైతం శాఖాహారానికి అనుకూలంగా తమ వాదనల్ని వినిపించటం.. నాన్ వెజ్ తో కలిగే ఇబ్బందుల్ని వివరంగా చెబుతుండటం కూడా బ్రిటన్ వాసుల్లో మార్పునకు కారణమైందని చెబుతున్నారు.