Begin typing your search above and press return to search.
అమెరికా వల్లే అప్ఘనిస్తాన్ కు ఈ దుస్థితి?
By: Tupaki Desk | 16 Aug 2021 8:30 AM GMTఅప్ఘనిస్తాన్ దేశం మళ్లీ ఉగ్రమూకలైన తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. తాలిబన్లు దేశ రాజధాని కాబూల్ ను ఆక్రమించుకోవడంతో దేశం వారి వశమైంది. అప్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశాన్ని విడిచి పారిపోవడంతో తాలిబన్లుఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యారు.
అమెరికా సేనలు అప్ఘనిస్తాన్ నుంచి వైదొలగగానే కనీస ప్రతిఘటన కూడా లేకుండా అప్ఘనిస్తాన్ ప్రభుత్వ బలగాలు చేతులెత్తేయడం నివ్వెరపరిచింది. దాదాపు 20ఏళ్లుగా అమెరికా సైనిక బలగాలు అక్కడ మోహరించి ఉండడం వల్ల తాలిబన్లు ఏమాత్రం ప్రభావాన్ని చూపలేకపోయారు. అమెరికా సైన్యం 20 ఏళ్లుగా 3 లక్షల మంది అప్ఘన్ ప్రభుత్వానికి శిక్షణ ఇచ్చినా వారు ఏ మాత్రం తాలిబన్లపై పోరాడకపోవడం చేతులెత్తేయడంతో ఆ దేశం ఉగ్రమూకల చేతుల్లోకి వెళ్లిపోయింది.
ఈ పరిణామాలపై బ్రటిన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ స్పందించారు. అప్ఘనిస్తాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని.. తమ సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలంటూ అమెరికా తీసుకున్న ఆ ఒకే ఒక్క నిర్ణయంతోనే ఆ దేశం తాలిబన్ల వశమైందని బ్రిటన్ ప్రధాని పేర్కొన్నారు. తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని ఎవరూ అడ్డుకోలేకపోవచ్చునని వ్యాఖ్యానించారు. అయితే తాలిబన్ల ప్రభుత్వాన్ని ఎవరూ గుర్తించకూడదని ఆయన ప్రపంచ దేశాలను కోరారు.
తాలిబన్ల ప్రభుత్వంపై పాశ్చాత్య దేశాలు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని బోరిస్ జాన్సన్ అభిప్రాయపడ్డారు. నాటో, ఐక్యరాజ్యసమితితో కలిసి తాలిబన్ల ప్రభుత్వాన్ని నిరోధించాల్సి ఉంటుందన్నారు. అప్ఘనిస్తాన్ మరోసారి ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా మారే ప్రమాదం లేకపోలేదని బోరిస్ జాన్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్ఘన్ నుంచి తమ దేశ పౌరులను వెనక్కి తీసుకురావడానికి పనిచేస్తున్నామన్నారు.