Begin typing your search above and press return to search.

చీరకట్టిన బ్రిటన్ ప్రధాని.. పూజలు చేశారు!

By:  Tupaki Desk   |   9 Nov 2016 10:48 AM GMT
చీరకట్టిన బ్రిటన్ ప్రధాని.. పూజలు చేశారు!
X
భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను విదేశీయులు ఎంతో గౌరవిస్తుండటం చాలా సందర్భాల్లో గమనిస్తూనే ఉంటుంటాం. అతిధులుగానే కాకుండా పర్యాటకులుగా మనదేశానికి వచ్చినప్పుడు వారు మన దేశ సంస్కృతి సంప్రదాయాలను ఆచరించేందుకుు ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. ఈ విషయంలో సామాన్యుల సంగతి కాసేపు పక్కనపెడితే... సాక్షాత్తూ బ్రిటన్ ప్రదానమంత్రి భారత సంప్రదాయం ప్రకారంగా నడుచుకొని అందరి అభినందనలనూ పొందుతున్నారు.

భారత్ లో రెండు రోజుల పర్యటన కోసం వచిన్న బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే... తన పర్యటనలో భాగంగా బెంగుళూరులో బిజి బిజీగా గడిపారు. ఈ సందర్భంలో తనకు బహుమతిగా వచ్చిన బంగారు రంగు పట్టుచీరను ధరించిన ఆమె.. కర్ణాటక రాష్ట్రంలోని హలసూరులోని సోమేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడికి వెళ్తే పద్దతిగా వెళ్లాలని భావించారో ఏమో కానీ... అచ్చూ భారతీయ స్త్రీ మాదిరిగానే ఆమె తన కట్టుబొట్టును మార్చేసుకున్నారు. కాసేపు తమ దేశం సంస్కృతి - సంప్రదాయాలను పక్కనపెట్టి, భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా చీరను ధరించారు.. బొట్టు కూడా పెట్టుకొన్నారు. మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారంగానే దేవాలయంలో శివలింగానికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కాగా ఆ ఆలయానికి భారతీయ సంప్రదాయాల ప్రకారం చీరకట్టుతో వచ్చిన బ్రిటన్ ప్రధానిని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. అనంతరం దేవాలయ పాలకమండలి ఆమెకు ఘనంగా స్వాగతం పలికగా... భారత - బ్రిటన్ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకొన్నట్టు ఆమె చెప్పారు. ఈ సందర్భంలో భారతీయ సంస్కృతి ప్రకారంగా దేవాలయానికి వచ్చిన బ్రిటన్ ప్రధానమంత్రిని పలువురు అభినందించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/