Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ అంతరాన్ని తగ్గించిన బ్రిటన్
By: Tupaki Desk | 16 May 2021 1:30 PM GMTఅధికారికంగా బీ.1.617.2 అని పిలువబడే భారతీయ మూలం వేరియంట్ ఇప్పుడు దేశంలో కేసులు విపరీతంగా పెరగడానికి కారణమవుతోంది. దీని వల్ల రాష్ట్రాలు లాక్డౌన్ పెట్టేస్తున్నాయి. భారత్ లో విజృంభిస్తున్న ఈ కరోనా వేరియంట్ రకంపై బ్రిటన్ దేశం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి యూకే ప్రభుత్వం సిద్ధమైంది. బ్రిటన్ దేశంలో లాక్డౌన్ ఎత్తివేసే ముందు భారత వేరియంట్ కారణంగా మనుసు మార్చుకున్నామని.. ఈ వైరస్ ఇంగ్లండ్ వాయువ్య ప్రాంతంలో కూడా బయటపడిందని.. "తీవ్రమైన ప్రభావం చూపుతోందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హెచ్చరించారు. టీకా పంపిణీని వేగవంతం చేస్తూ జాన్సన్ నిర్ణయం తీసుకున్నారు. రెండు టీకా మోతాదుల మధ్య అంతరాన్ని తగ్గించారు.
యూకే ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 50కి పైబడిన వ్యక్తులకు రెండు వ్యాక్సిన్ మోతాదుల మధ్య అంతరాన్ని 12 వారాల నుంచి 8 వారాలకు తగ్గించబడుతుందని ప్రకటించారు. రెండు వ్యాక్సిన్ మోతాదుల మధ్య అంతరాన్ని తగ్గించే యూకే నిర్ణయంతో దేశంలో మాత్రం రివర్స్ అయ్యింది. భారత్ లో టీకాల కొరతతో కోవిషీల్డ్ 2 మోతాదుల మధ్య అంతరాన్ని 4-8 వారాల నుండి 12-16 వారాలకు విస్తరించాలని భారతదేశం ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్రిటన్ లో తగ్గించగా.. భారత్ లో పెంచడం గమనార్హం.
షాట్ల మధ్య పెరిగిన అంతరాలతో యూకేలో ప్రయోజనాలు.. రక్షణను చూసిన తరువాత భారతదేశం ఈ అంతరాన్ని విస్తరించింది. యుకే భారతదేశం లో ప్రబలుతున్న బి .1.617 వేరియంట్ వ్యాప్తిపై ఆందోళనగా ఉంది. అందుకే టీకాల మధ్య అంతరాన్ని తగ్గించింది. "గత సోమవారం నుండి భారతదేశంలో మొట్టమొదట గమనించిన బీ.1.617 వేరియంట్ పెద్ద ఎత్తున కేసులను నమోదు చేస్తోంది. ఈ వేరియంట్ మునుపటి కంటే ఎక్కువ విస్తరిస్తోంది. కానీ ఎంత ద్వారా వినాశనం సృష్టిస్తుందో తెలియదు. 50 ఏళ్లు పైబడిన వారికి.. దేశవ్యాప్తంగా వైద్యపరంగా హాని ఉన్నవారికి టీకాలు వేయడాన్ని మేము వేగవంతం చేస్తాము, తద్వారా మొదటి మోతాదు తర్వాత 8 వారాల్లోనే మరో మోతాదులు వస్తాయి ”అని ప్రధాని జాన్సన్ తెలిపారు.
భారతీయ వేరియంట్ ఇంగ్లండ్ వాయువ్య ప్రాంతంలో వ్యాప్తితో జూన్ 21 నుండి అన్ని ప్రజా ఆంక్షలను ఎత్తివేయాలని బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకునేలా చేసింది. దక్షిణాసియా జనాభా అధిక సంఖ్యలో ఉన్నందున ఏప్రిల్‌లో బ్రిటన్ భారతదేశానికి ప్రయాణాలను నిషేధించింది. భారతదేశం నుండి వచ్చే వారు 10 రోజులు క్వారంటైన్ కోసం ప్రభుత్వం నియమించిన హోటళ్లలో ఉండటానికి ఒప్పుకుంటేనే ఆ దేశంలోకి ఎంట్రీ ఇస్తారు.