Begin typing your search above and press return to search.

అంతా సెట్ః మాల్యా ఇండియాకు వ‌చ్చేస్తున్నారు!

By:  Tupaki Desk   |   25 March 2017 4:32 AM GMT
అంతా సెట్ః మాల్యా ఇండియాకు వ‌చ్చేస్తున్నారు!
X
బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని వాటిని ఎగవేసి లండన్‌ కు పారిపోయిన కింగ్‌ ఫిషర్ ఎయిర్‌ లైన్స్ అధినేత - లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను తిరిగి భారత్‌ కు రప్పించడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన అభ్యర్థనను బ్రిటన్ ప్రభుత్వం ధ్రువీకరించింది. ఇందుకు సంబంధించి యూకే కోర్టు త్వరలో మాల్యాకు వ్యతిరేకంగా వారెంట్ జారీ చేయబోతుంది కూడా. గడిచిన నెలలో కేంద్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను యూకే గవర్నమెంట్ సర్టిఫై చేసిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బగ్లే తెలిపారు. మాల్యా అప్పగింత విజ్ఞప్తిని సెక్రటరీ ఆఫ్ స్టేట్ ధ్రువీకరించగా, దీనికి సంబంధించి వారెంట్ జారీని పరిశీలించాలని వెస్ట్‌ మిన్‌ స్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టు డిస్ట్రిక్ట్ జడ్జీకి సూచించింద‌ని వివరించారు.

మాల్యాను భారత్‌ కు ర‌ప్పించే విష‌యంలో భారతదేశ విదేశాంగ అభ్యర్థనను యూకేకు చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారి జిల్లా కోర్టుకు పంపించారని ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న గోపాల్ బగ్లే వెల్లడించారు. బ్యాంకుల‌కు మాల్యా ఎగ‌వేత వివ‌రాలు స‌హా ఆయ‌న అక్ర‌మాల వివ‌రాల‌న్నింటినీ భార‌త‌ ప్ర‌భుత్వం త‌ర‌ఫున అందించినందున జిల్లా కోర్టు స‌రైన నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని భావిస్తున్న‌ట్లు మాల్యా తెలిపారు. కాగా, మాల్యాకు చెందిన కింగ్‌ ఫిషర్ ఎయిర్‌ లైన్స్ వివిధ బ్యాంకులకు బకాయిపడిన రూ.9 వేల కోట్ల రుణాలను వసూలు చేసుకోవడానికి ఇప్పటికే బ్యాంకులు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. జనవరిలో సీబీఐ నాన్-బెయిలబుల్ వారెంట్‌ ను జారీ చేసింది. మ‌రోవైపు భార‌త ప్ర‌భుత్వం సైతం వేగంగా ముంద‌డుగు వేస్తోంది. ఈ క్ర‌మంలోనే రుణాల ఎగవేతకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యాపై యూకే హై కమిషన్ ఇప్పటికే దృష్టి సారించింది. ఇందులో భాగంగానే తాజాగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/