Begin typing your search above and press return to search.

మాల్యా కోసం హై సెక్యూరిటీ సెల్ సిద్ధం

By:  Tupaki Desk   |   11 Dec 2018 5:23 AM GMT
మాల్యా కోసం హై సెక్యూరిటీ సెల్ సిద్ధం
X
బ్యాంకుల‌కు వేల కోట్ల రూపాయ‌లు ఎగ్గొట్టి విదేశాల‌కు చెక్కేసిన లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యాను మ‌న‌దేశానికి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధ‌మైంది. మాల్యాను భార‌త్ కు అప్ప‌గించాలంటూ బ్రిట‌న్ లోని వెస్ట్ మినిస్ట‌ర్ కోర్టు సోమ‌వారం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. మ‌న‌దేశానికి ద‌క్కిన గొప్ప విజ‌యంగా ఈ ప‌రిణామాన్ని విశ్లేష‌కులు అభివ‌ర్ణిస్తున్నారు.

మాల్యాను మ‌న‌దేశానికి తీసుకొచ్చిన త‌ర్వాత ఆయ‌న్ను ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో ఉంచ‌నున్నారు. ఆయ‌న కోసం ఆ జైల్లో ఇప్ప‌టికే హై హై సెక్యూరిటీ సెల్‌ ను సిద్ధం చేశారు. ముంబ‌యి ఉగ్ర‌దాడుల దోషి అజ్మ‌ల్ క‌స‌బ్ ను గ‌తంలో ఈ జైల్లోనూ ఉంచ‌డం గ‌మ‌నార్హం. ఆరోగ్య ప‌రంగా ఏదైనా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి త‌లెత్తితే వెంట‌నే చికిత్స చేసేందుకు అక్క‌డ వైద్యులు అందుబాటులో ఉంటారు. ఇతర సెల్స్‌ కు దూరంగా ఈ హైసెక్యూరిటీ బరాక్స్ ఉన్నాయి. ఇవి నిరంత‌రం సీసీటీవీ నిఘాలో ఉంటాయి.

మ‌న‌దేశంలో బ్యాంకులకు స‌మారు రూ.9 వేల కోట్లు ఎగ్గొట్టిన మాల్యా 2016లో బ్రిట‌న్‌ కు ప‌రార‌య్యారు. అప్ప‌టి నుంచి ఆయ‌న లండ‌న్‌ లోని ఓ భ‌వంతిలో నివాసం ఉంటున్నారు. ఆయ‌న్ను స్వ‌దేశానికి రప్పించేందుకు భార‌త్ తీవ్రంగా ప్ర‌య‌త్నించి స‌ఫ‌ల‌మైంది. మాల్యాను మ‌న‌దేశానికి అప్ప‌గిస్తూ వెస్ట్ మినిస్ట‌ర్ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ స్వాగ‌తించింది. త్వ‌ర‌లోనే ఆయ‌న్ను స్వ‌దేశానికి తీసుకొస్తామ‌ని ప్ర‌క‌టించింది. అయితే - వెస్ట్ మినిస్ట‌ర్ కోర్టు తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు మాల్యాకు 14 రోజుల స‌మ‌య‌ముంది.