Begin typing your search above and press return to search.
చంద్రబాబు- మోడీకి చెక్ పెడతారా?
By: Tupaki Desk | 27 Oct 2017 4:31 AM GMTచంద్రబాబునాయుడు ఎంతకైనా సమర్థులు. ఆయన రాజకీయ వ్యూహచాతుర్యాలు అపూర్వమైనవి అని ఆయన సన్నిహితులు అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు రాజకీయాల్లో మోడీ కూడా అంతే తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కాకపోతే.. చంద్రబాబునాయుడు విజ్ఞప్తుల్ని ఆయన బుట్టదాఖలు చేస్తున్నారు. చంద్రబాబుకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండానే పాలన సాగిస్తున్నారు. ప్రాధాన్యం సంగతి తర్వాత.. అసలు చిన్నచూపు చూస్తున్నారని, లోకువ కడుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఏకంగా కేంద్రంలోని మోడీకే చెక్ పెట్టడానికి చంద్రబాబునాయుడు పావులు కదుపుతున్నారా? అనే సందేహాలు పలువురిలో కలుగుతున్నాయి. బ్రిటన్ లో చంద్రబాబునాయుడు గోల్డెన్ పీకాక్ అవార్డు అందుకున్న కార్యక్రమంలో - అక్కడి మంత్రి ప్రీతి పటేల్ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు గురించి పొటెన్షియల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటూ వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఇదేదో అనుకోకుండా వచ్చిన మాటలు కాదని, ఇలాంటి అభిప్రాయం ఒకటి చెలామణీలో ఉన్నదనడానికి సంకేతం అని పలువురు భావిస్తున్నారు.
ప్రధాని పదవికి ఉన్న ప్రత్యామ్నాయంగా కీర్తి గడించినందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక కీలక నాయకుడి రాజకీయ భవిష్యత్తు ఎలా మారిపోయిందో ఇటీవలి పరిణామాలు గమనిస్తున్న అందరికీ తెలుసు. అలాంటిది.. అనూహ్యమైన పోకడలతో సాగిపోయే మోడీ రాజకీయ చాణక్యం ముందు తన మీద కూడా అలాంటి ప్రచారం జరిగితే అది ఎలాంటి విపరిణామాలకు దారితీస్తుందోననే భయం చంద్రబాబుకు కూడా ఉండొచ్చు. ఆయనకు గతంలో కూడా కేంద్రంలో చక్రం తిప్పిన అనుభవం ఉంది. అయితే ఇప్పటి పరిస్థితులు వేరు. ఆయనకు పక్కలో బల్లెం లాగా కేంద్రం – తెలుగుదేశం తమకు మిత్రపక్షం - భాగస్వామ్య పక్షం అయినప్పటికీ.. వైఎస్సార్ కాంగ్రెస్ తో కూడా అంతే స్నేహాన్ని మెయింటైన్ చేస్తోంది. ఇటు తెలంగాణలోని తెదేపా వ్యతిరేక పార్టీ తెరాస కు కూడా అతే ప్రాధాన్యం ఇస్తోంది.
ఈ లెక్కన చూస్తే.. చెప్పుకోడానికి కేంద్రంలో భాగస్వామ్య పార్టీనే తప్ప.. తెరాస - వైకాపా ల తరహాలోనే తెదేపా పరిస్థితి కూడా ఉంది. అసలే ముక్కిడి ఆపై పడిశం అన్న సామెత చందంగా.. చంద్రబాబునాయుడు పరిస్థితి తయారవుతోంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న కేంద్రంతో సంబంధాలు - తాను ప్రధాని పదవికి పొటెన్షియల్ అభ్యర్థిననే ప్రచారంతో మరింత దిగజారుతాయని పలువురు అంటున్నారు.