Begin typing your search above and press return to search.
పోర్న్ స్టార్ కోసం కడుపు తీయించుకుంది
By: Tupaki Desk | 5 Oct 2015 6:00 AM GMTసెలబ్రిటీ యవ్వారం కాస్త చిత్రంగా ఉంటుంది. వ్యక్తిగతం అంటూనే.. ఆ విషయాన్ని జనాలకు చెప్పేయటం.. దాని మీద ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడితే తిట్టిపోయటం ఓ అలవాటుగా మారింది. గుట్టుగా ఉంచుకోవాలనుకుంటే అలానే ఉండిపోతే ఏ బాధా ఉండదు. తమ పని తాము చేసుకునే ప్రజల్ని కెలికి మరీ.. వారి దృష్టిలో పడేందుకు మాట్లాడటం.. ఆ తర్వాత దాని గురించి విమర్శలు చేయటం ఈ మధ్యన ఓ అలవాటుగా మారింది.
తాజాగా మోడల్ జోసి కన్నింగమ్ యవ్వారం ఇలానే ఉంది. ముగ్గురు పిల్లలకు తల్లి అయిన ఈ మోడల్ ఇప్పుడు తన కెరీర్ ను మార్చుకోవాలనుకుంటోంది. మోడల్ నుంచి పోర్న్ స్టార్ గా ప్రయాణం షురూ చేయాలని భావిస్తోంది. ప్రాశ్చాత్య దేశాల్లో పోర్న్ స్టార్ అయ్యేందుకు అనుమతులు ఉన్న నేపథ్యంలో.. ఎవరూ ఆమె ఎంచుకోనున్న వృత్తి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.
కానీ.. అమ్మడు తాజాగా గర్భవతి అయ్యింది. పన్నెండు వారాల బిడ్డ కడుపులో ఉంటే.. తాను ఎంచుకునే పోర్న్ స్టార్ కెరీర్ కు ‘‘గర్భం’’ అడ్డుగా వస్తుందని భావించిన ఆమె దాన్ని తీయించుకుంది. ఆ విషయాన్ని బయటపెట్టిన ఆమె.. ఎవరూ ఏమన్నా తాను పట్టించుకోనని చెబుతూ.. తిట్టే వాళ్లేమీ నా బిడ్డల్ని పెంచరు కదా అంటూ మాటలు చెబుతోంది. మాటలు అనే వారు సాయం చేయకపోవచ్చు. అలాంటప్పుడు.. ఏమీ చేయని వారికి.. తన వ్యక్తిగత విషయాల్ని చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? చూస్తుంటే.. వివాదాలు సృష్టించి మరింత ప్రచారం పొందటం ద్వారా వార్తల్లో వ్యక్తిగా మారి మరింత డిమాండ్ సంపాదించుకోవాలన్న వ్యూహంగా కనిపిస్తోంది. జనాల్ని అడ్డు పెట్టుకొని ఎంత ‘బిజినెస్’ చేసుకుంటుందీ అమ్మడు.