Begin typing your search above and press return to search.

బ్రెగ్టిజ్‌ కు బ్రిట‌న్ ఎంపీలు ఓకే చెప్పేశారు

By:  Tupaki Desk   |   9 Feb 2017 1:04 PM GMT
బ్రెగ్టిజ్‌ కు బ్రిట‌న్ ఎంపీలు ఓకే చెప్పేశారు
X
యూరోపియ‌న్ యూనియ‌న్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ప్ర‌క్రియ అయిన బ‌్రెగ్జిట్‌కు బ్రిటిష్ పార్ల‌మెంట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగే ప్ర‌క్రియ కోసం రూపొందించిన బిల్లుకు మంచి మెజార్టీతో ఓకే చెప్పింది. ఈ ప్ర‌క్రియ కోసం మార్చి 31లోపు చ‌ర్చ‌లు మొద‌లుపెట్టేలా బ్రిట‌న్ ప్ర‌ధాని థెరెసా మెకు క్లియ‌రెన్స్ ఇచ్చింది. నోటిఫికేష‌న్ ఆఫ్ విత్‌డ్రావ‌ల్ బిల్లుకు 494-122 ఓట్ల తేడాతో హౌజ్ ఆఫ్ కామన్స్ ఆమోదం తెలిపింది. ఇవాళ తుది చ‌ర్చ ముగిసిన త‌ర్వాత ఓటింగ్ నిర్వ‌హించారు. లిస్బ‌న్ ఒప్పందంలోని ఆర్టిక‌ల్ 50ని ప్ర‌యోగించేలా థెరెసా మెకు ఈ బిల్లు అవ‌కాశం క‌ల్పిస్తుంది. ప్ర‌క్రియ మొద‌లుపెట్టిన‌ప్ప‌టి నుంచి రెండేళ్ల‌లో బ్రెగ్జిట్ ముగుస్తుంది.

తాజా ప్ర‌క్రియ ముగిసిన నేప‌థ్యంలో బిల్లు హౌజ్ ఆఫ్ లార్డ్స్‌కు వెళ్తుంది. అక్క‌డి నుంచి ఫిబ్ర‌వ‌రి 20లోపు మ‌రోసారి హౌజ్ ఆఫ్ కామ‌న్స్‌కు వ‌స్తే.. అక్క‌డ దీనికి తుది ఆమోదం ల‌భిస్తుంది. చివ‌రి ద‌శ చ‌ర్చ‌లో భాగంగా చ‌ర్చల ప్ర‌క్రియ‌లో అనుస‌రించాల్సిన కీల‌క సూత్రాల‌కు సంబంధించి కొన్ని స‌వ‌ర‌ణ‌ల‌పై కామ‌న్స్ చ‌ర్చించింది. ఆ త‌ర్వాత చివ‌రి, మూడో ఓటింగ్ నిర్వ‌హించారు. ఈ బిల్లుకు ఏవైనా స‌వ‌ర‌ణ‌లు చేసినా, చేయ‌క‌పోయినా.. దీనికి మ‌ద్ద‌తు తెలుపాల్సిందిగా ప్ర‌తిప‌క్ష లేబ‌ర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్ త‌మ ఎంపీల‌కు సూచించారు. అయితే ఇందులో 52 మంది ఎంపీలు విప్‌ను ధిక్క‌రించడం గ‌మ‌నార్హం. అటు క‌న్జ‌ర్వేటివ్ పార్టీలోనూ థెరెసా మెకు 12 మంది ఎంపీలు ఎదురుతిరిగినా.. చివ‌రి నిమిషంలో వాళ్లు అనుకూలంగా ఓటేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/