Begin typing your search above and press return to search.
బ్రిటన్ ప్రధాని భారత పర్యటన రద్దు
By: Tupaki Desk | 19 April 2021 10:32 AM GMTబ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ భారత్ లో పర్యటించాలని మరోసారి భావించినప్పటికి , కరోనా వైరస్ దానికి అడ్డుకట్ట వేసింది. ఈ ఏడాది భారత రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిన బోరిస్ జాన్సన్ రావాల్సి ఉండగా , అప్పుడు కరోనా అక్కడ పీక్స్ లో ఉండటంతో రాలేకపోయారు. కానీ, బ్రిటన్‌లో కరోనా వైరస్ కేసులు అనూహ్యంగా పెరగడం, కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ వ్యాప్తి నేపథ్యంలో నాటి పర్యటనను రద్దు చేసుకున్నారు. దీనితో ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కోసం ఆయన ఈ నెల చివరి వారంలో భారత్ లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. కరోనా మళ్లీ తీవ్రం కావడంతో పర్యటనను కుదించుకున్నారు.
కానీ, కరోనా ఏమాత్రం శాంతించకపోవడంతో బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయింది. ఈ నేపథ్యంలో, వర్చువల్ విధానంలో భారత్, బ్రిటన్ పెద్దలు సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ పీఎం బోరిస్ జాన్సన్ అంగీకరించారు. భారత్, యూకే ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించనున్నారు.
యూరోపియన్ యూనియన్ (ఐరోపా దేశాల సమాఖ్య) నుంచి బ్రిటన్ వైదొలగిన తర్వాత ఆ దేశ ప్రధాని తొలిసారి భారత్ ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. ఈ ఏడాది జీ7 సదస్సును జూన్ లో బ్రిటన్ నిర్వహించనుంది. ఈ సదస్సుకు హాజరు కావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని యూకే ఆహ్వానించింది. అయితే.. జీ7 సదస్సుకు ముందే భారత పర్యటన కు బోరిస్ రావాలని అనుకున్నా కూడా కరోనా కారణంగా అది కుదరలేదు.