Begin typing your search above and press return to search.
ఈజీప్ట్ లో కాప్ 27 సదస్సు: వేదికపై నుంచి ఆగమేఘాలపై వెళ్లిపోయిన బ్రిటన్ ప్రధాని.. ఏమైంది?
By: Tupaki Desk | 8 Nov 2022 7:30 AM GMTప్రపంచ పర్యావరణ సదస్సుకు వెళ్లకూడదని నిర్ణయించుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తప్పు తెలుసుకొని యూటర్న్ తీసుకొని సడెన్ గా టూర్ ప్లాన్ చేశాడు. అందరినీ నివ్వెరపోయేలా చేశాడు రిషి సునాక్.
ఆదివారం రాత్రే సదస్సుకు చేరుకున్న రిషి.. పర్యావరణ మార్పులు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందించేసాయం.. భావితరాలకు సంక్షేమం గురించి కూడా ప్రసంగించారు. అయితే ఈ కీలక సమావేశం జరుగుతున్న సమయంలోనే హడావుడిగా అక్కడి నుంచి నిష్క్రమించడం అందరినీ షాక్ కు గురిచేసింది.
కాప్ 27 సదస్సులో సోమవారం ఈ నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. సదస్సు కొనసాగుతున్న సమయంలోనే ఆయన వద్దకు వచ్చిన సిబ్బంది చెవిలో ఏదో చెప్పారు. అనంతరం మరొకరు వచ్చి కూడా ఏదో సీరియస్ విషయాన్ని చెవిలో చెప్పారు. దీంతో వేదిక సదస్సు జరుగుతుండగానే అన్ని వదిలేసిన రిషిసునాక్ హడావుడిగా బయటకు వెళ్లిపోయారు. దీంతో ఏం జరుగుతుందో అర్థంకాక గందరగోళానికి గురయ్యారు అక్కడి దేశాల వారంతా..
ఈ విషయాన్ని యూకేకు చెందిన ఓ వెబ్ సైట్, ఇతర ప్రముఖులు వీడియో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. సహాయకులు ఏం చెప్పారు.? ఆయన ఎందుకు అక్కడి నుంచి వెళ్లిపోయారు? ఆయనింగా అక్కడే ఉన్నారా? బ్రిటన్ కు వెళ్లారా? దానిపై డౌనింగ్ స్ట్రీట్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
ఐరాసా నిర్వహించే పర్యావరణ మార్పుల సదస్సును కాప్ 27గా పిలుస్తారు. ఈజీప్ట్ లో రిసార్టుల వనంగా పేరున్న 'షెర్మ్ ఎల్ షేక్'లో ఈ సదస్సు ఆదివారం నుంచి మొదలైంది. 42 ఏళ్ల రిషి సునాక్ కు ప్రధాని హోదాలో ఇదే తొలి అధికారిక పర్యటన కావడం గమనార్హం. ఆయన అలా అర్థాంతరంగా ఎందుకు వెళ్లాడన్నది మాత్రం ఇప్పటికీ అంతుబట్టడం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.