Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్ : బ్రిటన్ ప్రధానమంత్రికి కరోనా పాజిటివ్ !

By:  Tupaki Desk   |   27 March 2020 12:30 PM GMT
బిగ్ బ్రేకింగ్ : బ్రిటన్ ప్రధానమంత్రికి కరోనా పాజిటివ్ !
X
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. సామాన్య ప్రజలు - డాక్టర్లతో పాటు మంత్రులు - దేశాధినేతలు సైతం కరోనా బారినపడుతున్నారు. తాజాగా యునైటెడ్ కింగ్‌ డమ్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌ కు కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన, ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సూచన మేరకు కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. ఈ టెస్ట్ లో ప్రధాని బోరిస్ కు కరోనా పాజిటివ్ అని వచ్చింది.

కాగా , కరోనా పాజిటివ్ అని తేలడంతో బోరిస్ డౌనింగ్ స్ట్రీట్ లోని తన ఇంట్లో ఐసొలేట్ అయ్యారు. ప్రస్తుతం ఆయనకి చికిత్స చేస్తున్నారు.అలాగే అయన ఆరోగ్యం ప్రస్తుతం బాగుంది అని తెలిపారు. ఇక తనకు కరోసా సోకిందన్న విషయాన్ని స్వయంగా బోరిస్ జాన్సన్ కూడా ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ వైరస్ పై తాము ఫైట్ చేస్తున్నట్లుగానే తాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ బాధ్యతలను లీడ్ చేయడం కొనసాగిస్తానని బోరిస్ జాన్సన్ తెలిపారు.

కాగా, యూకేలో ఇప్పటి వరకు 11,658 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 135 మంది ఇప్పటికే కోలుకోగా.. 578 మంది చనిపోయారు. ప్రస్తుతం 4,665 యాక్టివ్ కరోనా కేసులున్నాయని.. అందులో 163 మంది రోగుల పరిస్థితి విషమంగా ఉందని యూకే వైద్యాధికారులు తెలిపారు. ఐతే ఇప్పుడు ఏకంగా బ్రిటన్ ప్రధాన మంత్రికి కూడా కరోనా సోకడంతో అక్కడి ప్రజలలో ఆందోళన మరింతగా పెరిగిపోయింది.