Begin typing your search above and press return to search.

అడ్డంగా బుక్కవుతున్న రిషి సునాక్.. ఈసారి..!

By:  Tupaki Desk   |   21 Jan 2023 6:04 AM GMT
అడ్డంగా బుక్కవుతున్న రిషి సునాక్.. ఈసారి..!
X
ప్రవాసీ భారతీయుడు.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఏ పని చేసినా అడ్డంగా బుక్కవుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే క్రమంలోనే ఒత్తిడిలో ఆయన చిన్న చిన్న విషయాలను మరిచిపోతున్నట్లు కన్పిస్తోంది. వీటినే ప్రతిపక్ష పార్టీలు ఆయన బలహీనతలుగా ఎత్తిచూపుతూ ఒక ఆడుకుంటున్నాయి. దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య నిత్యం వాడీవేడి మాటల యుద్ధం కొనసాగుతోంది.

ఇటీవలే లండన్ లోని ఓ షెల్టర్ హోంను సందర్శించిన రిషి సునాక్ అక్కడే ఉన్న ఓ నిరాశ్రయుడితో సంభాషించారు. అయితే ఆ వ్యక్తి మాటలను రుషి సునాక్ పట్టించుకోకపోవడంతో విమర్శల పాలయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టడంతో ఆయన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిన సంగతి తెల్సిందే.

కాగా మరోసారి రిషి సునాక్ ఇలాంటి ఘటనతో ప్రతిపక్షాల ముందు మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. ఒక వీడియో చిత్రీకరణలో పాల్గొన్న ప్రధాని రిషి సునాక్ తన కారులో కొద్ది సమయంపాటు సీటు బెల్టును పెట్టుకోవడం మరిచిపోయారు. ఈ ఘటనలో అతడికి బ్రిటన్ పోలీసులు 100 పౌండ్ల జరిమానా విధించారు. ఈ విషయంలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

ఈ ఘటనపై డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి మాట్లాడుతూ హడావుడిగా నిర్ణయం తీసుకోవడం జరిగిన పొరపాటని తెలిపారు. ఒక చిన్న వీడియో క్లిప్ చిత్రీకరణలో పాల్గొన్న ప్రధాని రిషి సునాక్ కారులో తన సీటు బెల్టు కొద్దిసేపు తీశారని వెల్లడించారు. ఇలా చేయడం తప్పేనని అంగీకరిస్తూ క్షమాపణలు సైతం తెలియజేశారు. 'ప్రతీఒక్కరూ సీటు బెల్టు ధరించడం' తమ ఉద్దేశ్యమని వెల్లడించారు.

కాగా బ్రిటన్లో సీటు బెల్ట్ ధరించకపోవడం చట్టరీత్య నేరం. ఎవరైనా కారులో సీటు బెల్ట్ ధరించకపోతే అక్కడికక్కడే 100 పౌండ్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కోర్టుకు వెళితే మాత్రం ఈ జరిమానా 500 పౌండ్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే వైద్య పరమైన సమస్యలు ఉన్నవారికి సీటు బెల్ట్ విషయంలో మినహాయింపు ఉంటుంది.

అయితే రిషి సునాక్ మాత్రం దేశవ్యాప్తంగా 100 ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే పనిలో భాగంగా ఓ వీడియో చిత్రీకరణలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. అయితే ఆయన సీటు బెల్ట్ పెట్టుకోని కారణంగా ప్రతిపక్షాలకు మరోసారి అవకాశం కల్పించినట్లు అయింది.

ఈ ఘటనపై లేబర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ 'రిషి సునాక్ కు సీటు బెల్ట్.. డెబిట్ కార్డు.. ఆర్థిక వ్యవస్థ.. దేశాన్ని ఎలా నిర్వహించాలో కూడా తెలియడం లేదని' ఎద్దేవా చేశారు. ఈ జాబితా రోజురోజుకు పెరిగి పోతుందని విమర్శించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.