Begin typing your search above and press return to search.
బ్రిటన్ ప్రధాని ఎన్నికలు: మన భారతీయుడైన రిషినా? బ్రిటీష్ ట్రస్ నా?
By: Tupaki Desk | 31 Aug 2022 12:33 PM GMTబ్రిటన్ ప్రధానమంత్రి ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ బరిలో ఇద్దరు మిగిలారు. అందులో ఒకరు భారతీయుడు రిషి సునక్ కాగా.. మరొకరు లిజ్ ట్రస్. ఈ ఇద్దరిలో ఒకరు ప్రధాని పదవి చేపట్టడం ఖాయం. ప్రధాని పదవి చేపట్టే కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి పోటీలో ఉన్న లిజ్ ట్రస్, రిషి సునాక్ ఈ సాయంత్రం చివరి డిబేట్ లో పాల్గొననున్నారు.
కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు వేసేందుకు పార్టీ క్రియాశీల సభ్యులకు సెప్టెంబర్ 2 తుది గడువు. ప్రధాని అభ్యర్థి తుది ఫలితాన్ని సెప్టెంబరు 5న ప్రకటిస్తారు. అదే రోజు నూతన ప్రధాని బాధ్యతలు స్వీకరిస్తారు.
బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషి సునక్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఆయన ప్రధాని కాకుండా అక్కడి మీడియా రోజుకో అంశాన్ని లేనెత్తుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన జీవితంలోని ప్రతీ అంశాన్ని వివాదంగా మార్చి ప్రజలను తప్పుదోవ పట్టించేలా చేస్తున్నారని రిషి సునక్ మద్దతు దారులు వాపోతున్నారు. ఇటీవల రిషి సునక్ కు సంబంధించిన స్మిమ్మింగ్ ఫూల్ నిర్మాణ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రజలు ఓ వైపు తాగునీటి కోసం అల్లాడుతుంటే ప్రధాని కాబోయే వ్యక్తి స్విమ్మింగ్ ఫూల్ లో ఎంజాయ్ చేస్తున్నారని ‘ది ఇండిపెండెంట్’ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ వ్యవహారంలో రిషు సునక్ భవిష్యత్ పై ప్రభావం పడనుందా..? అనే చర్చ సాగుతోంది.
బ్రిటన్ ఎన్నికలకు మరో నెలరోజుల గడువు మాత్రమే ఉంది. ప్రధాని రేసులో రిషి సునక్, యూకే ఫారిన్ సెక్రెటరీ లిజ్ ట్రస్ పైచేయి సాధిస్తూ ముందుకెళ్తున్నారు. ఈ తరుణంలో రిషి సునక్ పై వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. దీంతో రిషి సునక్ ను ఇంకా ఎన్ని సమస్యలు చుట్టుముట్టుకుంటాయోనని చర్చించుకుంటున్నారు. అయితే భారత సంతతికి చెందిన వ్యక్తి ప్రధాని రేసులో ఉన్నాడనే అక్కసుతోనే యూకే మీడియా చిన్న చిన్న అంశాలను హైలెట్ చేస్తోందని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే రిషి సునక్ పై వచ్చిన ఆరోపణలను నివృత్తి చేసుకుంటే తప్ప ప్రధాని రేసులో మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఇప్పుడు కన్జర్వేటివ్ పార్టీ క్రియాశీల సభ్యుల ఓట్లే కీలకంగా ఉన్నాయి. వారి ఓట్లు అన్నీ లిజ్ ట్రస్ కే పడుతాయని అంటున్నారు. గట్టి పోటీనిచ్చినా రిషి సునక్ విజయం కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.