Begin typing your search above and press return to search.

బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీలో ‘గే’ కలకలం

By:  Tupaki Desk   |   19 Sep 2016 6:29 AM GMT
బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీలో ‘గే’ కలకలం
X
బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన ఒకరి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ కజిన్ లార్డ్ ఐవర్ మౌంట్ బాటెన్ ఓ సంచలన విషయాన్ని ప్రకటించారు. ఇంతకీ ఆయన ఎవరంటారా? క్వీన్ విక్టోరియాకు మౌంట్ బాటెన్ మునిమనమడు. ఇప్పటివరకూ ఆయన్ను అనుకున్న దానికి భిన్నంగా తాను మగాడిని కానని.. ‘గే’ అన్న విషయాన్ని బయటకు వెల్లడించారు. బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీలో గే అని చెప్పిన తొలి వ్యక్తిగా మౌంట్ బాటెన్ నిలిచారు. గతంలో ఆయనకు పెళ్లి కావటం.. ముగ్గురు పిల్లలు ఉండటం గమనార్హం.

తాను బైసెక్సువల్ అని.. ఆ విషయాన్ని తన భార్య పెనెలోపె థామ్సన్ ను చెప్పినట్లుగా మౌంట్ బాటెన్ చెప్పారు. తాను చెప్పిన విషయాన్ని తన భార్య (ఇప్పుడు మాజీ) అర్థం చేసుకుందని.. తాను లైంగికంగా సమస్యలు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం భార్యకు విడాకులు ఇచ్చేసిన ఆయన.. ఒక ఎయిర్ లైన్ క్యాబిన్ సర్వీసెస్ డైరెక్టర్ జేమ్స్ కోయ్లెతో కలిసి హ్యాపీగా గడిపేస్తున్న సంచలన విషయాన్ని చెప్పేశారు. తాను పెళ్లికి ముందే గే అన్న విషయాన్ని తన మాజీ భార్యకు తెలుసని చెప్పిన ఆయన.. ఇప్పుడు తాను చాలా హ్యాపీగా బతికేస్తున్నట్లుగా చెప్పారు. అతని హ్యాపీ మాట ఎలా ఉన్నా.. బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీకి మాత్రం ఈ వ్యవహారం తల కొట్టేసినంత అవమానంగా ఉందట.