Begin typing your search above and press return to search.
కరోనాకు వాక్సిన్.. బ్రిటన్ శాస్త్రవేత్తల విజయం
By: Tupaki Desk | 6 Feb 2020 11:30 AM GMTచైనాలో పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు విరుగుడు కనిపెట్టే పనిలో ప్రపంచంలోని శాస్త్రవేత్తలంతా తీవ్రంగా పరిశోధన చేస్తున్నారు. తాజాగా ఈ వైరస్ కు వాక్సిన్ ను కనుగొనడంలో బ్రిటీష్ శాస్త్రవేత్తలు గొప్ప ముందడుగు వేశారు.
ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ కు చెందిన శాస్త్రవేత్తలు తాజాగా వాక్సిన్ ను తయారు చేశారు. జంతువులపై పరీక్షించి చూడనున్నారు. వచ్చేవారం పరీక్షలు ప్రారంభమవుతాయని ప్రొఫెసర్ రాబిన్ షటూక్ ప్రకటించారు.వచ్చే ఎండా కాలం నుంచి మనుషులపై ప్రయోగాలు చేస్తామని తెలిపారు. తమకు మరిన్ని నిధులు అవసరమవుతాయన్నారు.
ఇప్పటికే జికా వైరస్ కు శాస్త్రవేత్తలు మందు కనిపెట్టడానికి 7 నెలలుగా శోధిస్తున్నారు. ఇప్పటికీ సాధించలేదు. కానీ ఇప్పుడు బ్రిటీష్ శాస్త్రవేత్తలు కరోనా వైరస్ కు వాక్సిన్ తయారు చేయడంలో విజయం సాధించారు. సాధారణంగా మూడేళ్లు పట్టే వాక్సిన్ తయారీని కేవలం కొద్దిరోజుల్లోనే తయారు చేయడం గొప్ప విజయంగా ప్రొఫెసర్ రాబిన్ ప్రకటించారు. రెండు మూడు నెలల్లోనే ఈ వాక్సిన్ తీసుకొస్తామని తెలిపారు.