Begin typing your search above and press return to search.

అవును.. బ్రిటీష్ పౌండ్స్ కు నో అంటూ బోర్డులు

By:  Tupaki Desk   |   24 Jun 2016 12:16 PM GMT
అవును.. బ్రిటీష్ పౌండ్స్ కు నో అంటూ బోర్డులు
X
కాలం.. ఖర్మం కాలిపోతే పరిస్థితులు ఇలానే ఉంటాయి. ప్రపంచంలో అత్యంత పవర్ ఫుల్ అయిన కరెన్సీల్లో ఒకటైన బ్రిటీష్ పౌండ్స్ ను తీసుకునేందుకు నో అని చెబుతారా? కానీ.. ప్రస్తుతం అలాంటి దుస్థితే ఎదురైంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్లో గ్రీస్ లోని కొన్ని టూరిస్ట్ ప్లేస్ లలో కొన్ని బోర్డులు ఏర్పాటు చేశారు. వీటి సారాంశం చూసిన బ్రిటీష్ టూరిస్ట్ లు షాక్ తినే పరిస్థితి.

ఇంతకీ ఆ బోర్డులేమిటంటే.. సెంట్రల్ బ్యాంక్ నుంచి తమకు మారకం విలువ గురించి సమాచారం ఇవ్వని నేపథ్యంలో.. బ్రిటీష్.. స్కాటిష్ పౌండ్స్ ను తీసుకోలేమని బోర్డులు పెట్టేశారు. ఈ కరెన్సీ మారకం విలువ గురించి సమాచారం ఇవ్వకపోవటంతో తాము ఏమీ చేయలేమంటూ చేతులెత్తేశారు. దీంతో టూరిస్ట్ లుగా గ్రీస్ కు వచ్చిన పలువురు బ్రిటీష్.. స్కాటిష్ పౌరులు దిక్కుతోచని పరిస్థితి. చేతిలో డబ్బులున్నా.. వాటికి చిత్తు కాగితాల్లా ఎలాంటి విలువ లేనట్లుగా బోర్డులు పెట్టటంతో ఏం చేయాలో అర్థం కాక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీల్లో తమది ఒకటన్న భావనలో ఉన్న వారికి ఇంతకు మించిన షాక్ ఇంకేం ఉంటంది.