Begin typing your search above and press return to search.
ఎయిర్ పోర్ట్ లో పోర్న్ వీడియోల ప్రసారం.. అంతా షాక్
By: Tupaki Desk | 28 May 2022 7:30 AM GMTబ్రెజిల్ లోని ఓ ఎయిర్ పోర్ట్ లో అనూహ్య ఘటన ఒకటి చోటుచేసుకుంది. రాజధాని రియోడి జెనీరియోలోని సాంటోస్ డ్యూమంట్ విమానాశ్రయంలో ఎలక్ట్రానిక్ డిస్ ప్లేలు హ్యాకింగ్ కు గురయ్యాయి. అనంతరం వాటిల్లో పోర్నో గ్రఫీ వీడియోలు ప్రసారకావడం దుమారం రేపింది. ప్రయాణికులంతా అవాక్కైన పరిస్థితి నెలకొంది.
రియో డీ జెనీరియోలోని ఓ ఎయిర్ పోర్ట్ లో ఎలక్ట్రానిక్ డిస్ ప్లేలు హ్యాకింగ్ కు గురైనట్లు ఫెడరల్ పోలీసులకు శుక్రవారం సమాచారం అందించింది.
బ్రెజిల్ ఎయిర్ పోర్ట్ అథారిటీ ఇన్ ఫ్రా ఏరో, ప్రకటనలు, విమానాల సమాచారానికి బదులు ప్రయాణికులకు వాటిల్లో పోర్న్ వీడియోలు చూపించినట్లు తెలిపింది. అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వాటిని చూసి కొందరు ప్రయాణికులు ఆశ్చర్యానికి గురికాగా.. మరికొందరు నవ్వుతూ కనిపించారు.
కొందరు ప్రయాణికులు తమ చిన్నారులను వాటిని చూడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సమాచార సేవలను ఔట్ సోర్సింగ్ ద్వారా మరో కంపెనీ నుంచి పొందుతున్నట్లు ఇన్ ఫ్రా ఏరో తన ప్రకటనలో తెలిపారు. ఈ సంస్థ కూడా ఈ మేరకు సమాచారం అందించినట్లు వెల్లడించింది.
మా మీడియా తెరలపై ప్రసారమైన కంటెంట్ కు ప్రకటన హక్కులను కలిగి ఉన్న సంస్థలదే బాధ్యత అని ఇన్ ఫ్రా ఏరో పేర్కొంది. తమ పార్ట్ నర్లు వారి సొంత ప్రసార వ్యవస్థలను వినియోగిస్తున్నారని.. దానికి ఇన్ ఫ్రా ఏరో ఫ్లైట్ ఇన్ ఫర్మేషన్ సిస్టంకు సంబంధం లేదని స్పష్టం చేసింది. హ్యాకింగ్ కు గురైన స్క్రీన్ లను ఆఫ్ చేసినట్లు తెలిపింది.